ఇలాంటి మాటలను ఎవరైనా మీకు చెప్తే అస్సలు నమ్మొద్దు.. ఓ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలను ఎలా పోగొట్టుకున్నాడంటే.

ABN , First Publish Date - 2023-02-02T14:27:43+05:30 IST

అతడిని కొట్టలేదు, నేరుగా అతనితోనే డబ్బు తీసుకుని వెళ్ళారు దుండగులు. మనిషిని కొట్టకుండా, చంపకుండా డబ్బు దోచేస్తున్నమోసాల్లో మాటలతో మాయ చేయడం కూడా ఒకటి

ఇలాంటి మాటలను ఎవరైనా మీకు చెప్తే అస్సలు నమ్మొద్దు.. ఓ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలను ఎలా పోగొట్టుకున్నాడంటే.

.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరూ అతడి దగ్గర ఎత్తుకు పోలేదు, అతడిని కొట్టలేదు, నేరుగా అతనితోనే డబ్బు తీసుకుని వెళ్ళారు దుండగులు. మనిషిని కొట్టకుండా, చంపకుండా డబ్బు దోచేస్తున్నమోసాల్లో మాటలతో మాయ చేయడం కూడా ఒకటి. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో ఒక వ్యక్తి మెడికల్ స్టోర్ పెట్టాడు. ఒక కుర్రాడు మెడికల్ స్టోర్ కు వచ్చి తనకు కావలసిన కొన్ని మందులు తీసుకున్నాడు. ఆ కుర్రాడు మందులకు అయిన బిల్లుకు తనదగ్గరున్న అమెరికన్ డాలర్ తీసి మెడికల్ స్టోర్ వ్యక్తికి ఇచ్చాడు. ఆ మెడికల్ స్టోర్ వ్యక్తి 'ఇక్కడ అమెరికన్ డాలర్ కాదు ఇండియన్ రూపీస్ ఏ ఇవ్వాలి' అని చెప్పాడు. సరేనని ఆ కుర్రాడు మందులకు తగిన డబ్బు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ తరువాత మెడికల్ స్టోర్ వ్యక్తికి కొత్త నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మెడికల్ స్టోర్ అతను లిఫ్ట్ చెయ్యగా తనను తాను పరియం చేసుకుని 'నాదగ్గర మొత్తం అమెరికన్ డాలర్లే ఉన్నాయి. వాటిని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు మీరు నాలుగు లక్షలు ఇవ్వకపోయినా పర్లేదు కనీసం రెండు లక్షలు ఇవ్వండి. నాకు ఇలా సగమే తీసుకోవడం నష్టమే అయినా నా అవసరం అలా ఉంది' అని అడిగాడు.

మెడికల్ స్టోర్ వ్యక్తి మొదట పట్టించుకోకపోయినా అతను అదే విషయాన్ని మాటిమాటికి ఫోన్ చేసి చెప్పేసరికి ఆ మెడికల్ స్టోర్ వ్యక్తికి డబ్బు మీద ఆశ పుట్టింది. 'సరే నువ్వు అడిగినట్టే ఇస్తానులే' అన్నాడు. ఆ కుర్రాడు తాము ఎక్కడ కలవాలో మెడికల్ స్టోర్ వ్యక్తికి చెప్పాడు. ఆ కుర్రాడు చెప్పినట్టే మెడికల్ స్టోర్ వ్యక్తి ఒక సందులోకి కలిశాడు. అక్కడ ఆ కుర్రాడితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్ళు మెడికల్ స్టోర్ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని లెక్కబెట్టుకుని 'లెక్కమొత్తం సరిపోయింది బ్రదర్. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి డాలర్లు పెట్టిన బ్యాగ్ తీసకుకొస్తాము' అని అక్కడి సందు మలుపు తిరిగి వెళ్లారు. అలా వెళ్ళిన ఆ కుర్రాడు కానీ, ఆ కుర్రాడితో ఉన్న మరొక వ్యక్తి కానీ మళ్ళీ తిరిగిరాలేదు. అదిగో వస్తారు, ఇదిగో వస్తారు అనుకున్న ఆ మెడికల్ స్టోర్ వ్యక్తి చాలాసేపు ఎదురుచూసి చివరికి తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసిటివి పుటేజిల ఆధారంగా మోసగాళ్ళను పట్టుకుంటామని తెలిపారు.

Updated Date - 2023-02-02T14:27:51+05:30 IST