ముచ్చటగా మూడో భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తి.. మొదటి ఇద్దరి గురించి పోలీసులు విచారిస్తే బయటపడ్డ షాకింగ్ విషయాలు..

ABN , First Publish Date - 2023-01-25T19:11:10+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి తన మొదటి భార్యను హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించాడు. కుదరకపోవడంతో విడాకులు ఇచ్చాడు.. ఆ తర్వాత మరో యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.. ఆ తర్వాత వారిని మాయం చేసి మూడో వివాహం చేసకున్నాడు..

ముచ్చటగా మూడో భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తి.. మొదటి ఇద్దరి గురించి పోలీసులు విచారిస్తే బయటపడ్డ షాకింగ్ విషయాలు..

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh)రత్లాంకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి తన మొదటి భార్యను హత్య చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించాడు. కుదరకపోవడంతో విడాకులు ఇచ్చాడు.. ఆ తర్వాత మరో యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.. ఆ తర్వాత వారిని మాయం చేసి మూడో వివాహం చేసకున్నాడు.. చాలా రోజులుగా అతని రెండో భార్య, పిల్లలు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పొలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి (Crime News).

రత్లాంకు చెందిన సోనూ తల్వాడే అనే వ్యక్తి రైల్వేలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతను 12 ఏళ్ల క్రితం తొలి వివాహం చేసుకున్నాడు. భార్య తరచుగా గొడవ పడుతుండడంతో ఆమెను చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించాడు. కుదరకపోవడంతో విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇషా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. ఆ సమయంలోనే మరో యువతితో ప్రేమాయణం ప్రారంభించాడు. ఆ విషయం తెలుసుకున్న ఇషా భర్తను నిలదీసింది. దీంతో ఆమెను, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి చంపి ఇంట్లోనే పాతేశాడు (Husband Killed Wife). అదే ఇంట్లో మరో మహిళతో కలిసి జీవనం ప్రారంభించాడు.

ఏమీ జరగనట్టు రోజూ ఉద్యోగానికి వెళ్లి, వచ్చేవాడు. అయితే చాలా రోజులుగా నిషా, ఇద్దరు పిల్లలు కనిపించకపోడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. అడిగితే ఒక్కొక్కరికి ఒక్కోలా సోనూ సమాధానం చెప్పేవాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సోనూను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపెట్టాడు. షాకైన పోలీసుల సోనూ ఇంట్లో తవ్వకాలు జరిపి మృతదేహాలను వెలికి తీశారు.

Updated Date - 2023-01-25T19:11:10+05:30 IST