ఈ మహిళా ఎస్సై గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-01-31T20:40:50+05:30 IST

ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న ఉద్యుగులే బైక్‌లు, కార్లు మెయింటెన్ చేస్తున్నారు.. అలాంటిది ఓ పోలీస్ అధికారిణి (Chennai woman cop) ఇప్పటికీ సైకిల్ మీదే విధులకు హాజరవుతోంది.. 45 ఏళ్ల వయసులోనూ సైకిల్‌ను ఉపయోగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది..

ఈ మహిళా ఎస్సై గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. 23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు.. ఎందుకంటే..

ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న ఉద్యుగులే బైక్‌లు, కార్లు మెయింటెన్ చేస్తున్నారు.. అలాంటిది ఓ పోలీస్ అధికారిణి (Chennai woman cop) 23 ఏళ్లుగా సైకిల్ మీదే విధులకు హాజరవుతోంది.. 45 ఏళ్ల వయసులోనూ సైకిల్‌ను ఉపయోగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.. ఆఫీస్ పనులే కాదు.. ఇంటి పనులకు కూడా ఆమె సైకిల్‌నే (cycling) వినియోగిస్తోంది.. 23 ఏళ్లుగా ఆమె సైకిల్ పైనే డ్యూటీకి వెళ్తుండడం విశేషం.

చెన్నైలోని (Chennai) ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో 45 ఏళ్ల పుష్పరాణి గత 23 ఏళ్లుగా (cycling for the past 23 years) సైకిల్ పైనే విధులకు హాజరవుతోంది. 1997లో ఆమె కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అంచెలంచెలుగా ఆమె ఎస్సై ర్యాంకుకు ఎదిగారు. అయినా అమె సైకిల్‌ను ఉపయోగించడం మాత్రం మానలేదు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ఆమె తండ్రి సైకిల్‌పైనే డ్యూటీకి వెళ్లేవారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పుష్ప రాణి కూడా సైకిల్‌ను వదలడం లేదు. డ్యూటీలో జాయిన్ అయ్యాక ఆమె ఇప్పటివరకు ఏడు సైకిళ్లను మార్చారు.

పుష్పరాణి ఇప్పుడు వాడుతున్న సైకిల్‌ను చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. పుష్పరాణి మాత్రమే కాదు.. ఆమె ఇద్దరు పిల్లలు కూడా సైకిళ్లపైనే పాఠశాలకు వెళ్తుంటారు. సింపుల్‌గా జీవించడం తనకు ఇష్టమని, అందుకే సైకిల్‌ను ఉపయోగిస్తుంటానని పుష్పరాణి చెప్పారు. పైగా సైకిల్ తొక్కడం ఆరోగ్యకరం అని, అందుకే తాను ఎప్పుడూ సైకిల్‌ను వదులుకోలేదని తెలిపారు.

Updated Date - 2023-01-31T20:40:52+05:30 IST