ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా?? పిల్లాడికి టికెట్ తీసుకోమన్నందుకు వదిలేసిపోయారు..

ABN , First Publish Date - 2023-02-02T12:16:32+05:30 IST

టికెట్ తీసుకొమ్మంటే వినకుండా వీళ్ళు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు

ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా?? పిల్లాడికి టికెట్ తీసుకోమన్నందుకు వదిలేసిపోయారు..

ఆ దంపతులిద్దరూ విమాన ప్రయాణానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వారు తమతోపాటు తమ పిల్లాడిని కూడా తీసుకెళ్ళాలని అనుకున్నారు. అయితే పిల్లాడి కోసం అదనంగా డబ్బు చెల్లించాలని టికెట్ కౌంటర్ లో వారు చెప్పడంతో పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

బెల్జియం దేశానికి చెందిన దంపతులిద్దరికీ పాస్పోర్ట్ లు ఉన్నాయి. వాళ్ళిద్దరూ బెల్జియం నుండి బ్రిటన్ కు వెళ్ళడానికి ప్లాన్ వేసారు. వాళ్ళతో పాటు తమ పిల్లాడిని వెంట తీసుకెళ్ళాలని అనుకున్నారు. అయితే ఆ పిల్లాడి ప్రయాణానికి ఎలాంటి టికెట్ తీసుకోలేదు. దీంతో టికెట్ కౌంటర్ లో ఉన్న సిబ్బంది పిల్లాడిని అనుమతించాలంటే అదనంగా డబ్బు చెల్లించాలని చెప్పడంతో వాళ్ళు పిల్లాడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళు చేసినపనికి అక్కడున్న అందరూ షాక్ కు గురయ్యారు. వీళ్ళెక్కడి తల్లిదండ్రులురా బాబు. అంత చిన్న పిల్లాడిని అలా వదిలేసిపోతున్నారు అని అనుకున్నారు.

అయితే ఆ తరువాత ఆ జంట డ్రామా ప్లే చేసింది. వాళ్ళు పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయిన తరువాత సిబ్బందిని పిలిచి 'అక్కడ మా బాబు ఉన్నాడు, బాబును మాదగ్గరకు తీసుకురండి' అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సిబ్బంది కుదరదని చెబితే సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పారు. 'పిల్లాడి ప్రయాణానికి అదనంగా డబ్బు చెల్లించమంటే వెళ్ళిపోయి తరువాత సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తున్నారు' అని ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసారు.

Updated Date - 2023-02-02T12:16:35+05:30 IST