Viral Video: నీళ్లు తాగుతున్న గేదె.. సడన్‌గా మొసలి ఎంట్రీ.. వీడియోను చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-01-25T16:27:44+05:30 IST

నీటిలో ఉండే మొసలి అత్యంత బలవంతమైనది. నీటిలో ఉన్న మొసలి (Crocodile) బలం ముందు ఏనుగు కూడా సరితూగలేదని అందరికీ తెలిసిందే. నీటిలో ఉన్న మొసలికి చిక్కితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే, ఓ గేదె (Buffalo) నీటిలో ఉన్న మొసలికి చుక్కలు చూపించింది.

Viral Video: నీళ్లు తాగుతున్న గేదె.. సడన్‌గా మొసలి ఎంట్రీ.. వీడియోను చూస్తే అవాక్కవడం ఖాయం..!

నీటిలో ఉండే మొసలి అత్యంత బలవంతమైనది. నీటిలో ఉన్న మొసలి (Crocodile) బలం ముందు ఏనుగు కూడా సరితూగలేదని అందరికీ తెలిసిందే. నీటిలో ఉన్న మొసలికి చిక్కితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే, ఓ గేదె (Buffalo) నీటిలో ఉన్న మొసలికి చుక్కలు చూపించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఆ వీడియోలో.. ఓ గేదె నీరు తాగేందుకు నదిలోకి దిగింది. అంతలో ఓ మొసలి వేగంగా వచ్చి ఆ గేదెను పట్టేసింది. రెండింటి మధ్య చాలా సేపు పోరాటం జరిగింది (Buffalo fights with Crocodile). గేదెను మొసలి నీటిలో లాక్కెళ్లిపోవడం ఖాయం అనిపించింది. అయితే గేదె పట్టు విడవకుండా పోరాడి మొసలినే నీటి నుంచి బయటకు లాగేసింది. ఆ తర్వాత గేదెను వదిలి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటికే 75 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.

Updated Date - 2023-01-25T16:44:01+05:30 IST