Viral: రూ.20 వేల పెట్టుబడి.. కానీ లాభం మాత్రం ఏకంగా లక్షన్నర.. ఈ అన్నాదమ్ముళ్లు చేస్తున్న పనేంటంటే..

ABN , First Publish Date - 2023-01-27T19:34:59+05:30 IST

పెట్టుబడిపై భారీ లాభాలు రాబట్టాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సిద్ధపడాలి. రిస్క్‌కు వెరవకూడదు. కానీ.. ఓ ఇద్దరు యువకులు రూ.20 వేల పెట్టుబడితోనే మంచి లాభాలు కళ్లచూశారు.

Viral: రూ.20 వేల పెట్టుబడి.. కానీ లాభం మాత్రం ఏకంగా లక్షన్నర.. ఈ అన్నాదమ్ముళ్లు చేస్తున్న పనేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడిపై భారీ లాభాలు రాబట్టాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సిద్ధపడాలి. రిస్క్‌కు వెరవకూడదు. కానీ.. ఓ ఇద్దరు యువకులు రూ.20 వేల పెట్టుబడితోనే మంచి లాభాలు కళ్లచూశారు. ప్రభుత్వ సాయంతో రిస్క్ లేకుండానే తమ ఆర్థిక స్థితిని ఏడాదిలోనే నిలిచిన ఇద్దరు యువకులు విజయగాథను ఓ మారు తెలుసుకుందాం పదండి.

హరియాణాకు(Haryana) చెందిన నూహ్(Nuh) జిల్లా.. అన్ని రంగాల్లోనూ వెనకబడ్డ ప్రాంతం. జిల్లాల్లోని గుబ్రాదీ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సాహుద్, రిజ్వాన్ మాత్రం ఈ వెనుకబాటు తనాన్ని జయించారు. పెట్టుబడిపై ఏకంగా ఐదు రెట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ శభాష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ సాయంతో తేనెటీగల పెంపకం చేపట్టి ఆర్థికంగా మెరుగుపడ్డారు. జిల్లా ఉద్యానపంటల విభాగం సాయంతో వారు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తొలుత వారు 50 పెట్టెలు కొనుక్కున్నారు. వీటి ధరపై ప్రభుత్వం 85 శాతం సబ్సిడీ ఇవ్వడంతో కేవలం రూ.20 వేలతోనే వారు బాక్సులను కొనుగోలు చేశారు. ఆ తరువాత కొద్ది నెలల్లోనే వారు తేనె, వ్యాక్స్‌ను అమ్మి ఏకంగా లక్షన్నర ఆదాయం, కళ్లు చెదిరే లాభాలు సాధించారు.

1.jpgవారి విజయం గ్రామంలోని అనేక మందిలో స్ఫూర్తిని రగిలించింది. ఈ అన్నదమ్ముల బాటలోనే నడుస్తూ గ్రామంలోని ఇతర యువత ఆర్థికంగా ఎదుగుతున్నారు. తేనెటీగల పెంపకం(Beekeeping) యువతకు మంచి ఆదాయ మార్గమని జిల్లా ఉద్యానపంటల విభాగం అధిపతి పేర్కొన్నారు. దీంతో ఏడాదికి అదనంగా రూ.2లక్షల మేర ఆదాయాన్ని పొందొచ్చని తెలిపారు. ఉద్యోగాల వెంట పరుగులు తీసి అలసిపోయే బదులు సొంతకాళ్లపై నిలబడి ఆదర్శంగా నిలిచిన ఈ అన్నదమ్ములపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

Updated Date - 2023-01-27T19:35:01+05:30 IST