విక్రమ్ క్రెడిట్ కార్డ్‌ అంటే ఏమిటి? అది ఇండియన్ ఆర్మీ జవానులకు ఎలా ఉపయోగపడుతుందంటే...

ABN , First Publish Date - 2023-01-25T11:54:27+05:30 IST

బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్) అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ.

విక్రమ్ క్రెడిట్ కార్డ్‌ అంటే ఏమిటి? అది ఇండియన్ ఆర్మీ జవానులకు ఎలా ఉపయోగపడుతుందంటే...

బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్) అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఇప్పుడది ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాల సభ్యుల కోసం విక్రమ్ క్రెడిట్ కార్డ్‌ను పరిచయం చేసింది. బీఎఫ్ఎస్ఎల్ తెలిపిన వివరాల ప్రకారం విక్రమ్ క్రెడిట్ కార్డ్ నిస్వార్థంగా మనల్ని రక్షించే, మన దేశానికి సేవ చేసే సైనికుల క్రెడిట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.

ఇండియన్ ఆర్మీ (యోద్ధ), ఇండియన్ నేవీ (వరుణ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ (రక్షమాహ్), అస్సాం రైఫిల్స్‌తో, బీఎఫ్‌ఎస్‌ఎల్ ఇప్పటికే ప్రత్యేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను (ది సెంటినెల్) కలిగి ఉంది. 74వ గణతంత్ర దినోత్సవానికి ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖించి కొత్త క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు.

ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లు. యాక్టివేషన్ బోనస్‌గా ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లైఫ్‌టైమ్ ఫ్రీ (ఎల్టీఎఫ్) క్రెడిట్ కార్డ్‌తో వస్తుంది. ప్రమాద మరణ కవరేజీ కింద రూ. 20 లక్షలు అందుతాయి.

ఒక శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు ఆఫర్ ఉంది. మిలటరీ, పారామిలిటరీ, పోలీసు బలగాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టడం గురించి బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఎండీ & సీఈఓ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ విక్రమ్ అనే పేరు తెలివైన, బోల్డ్, బలమైన వ్యక్తిని సూచిస్తుందని వివరించారు. అంటే విజేత అని అర్థం. ఈ క్రెడిట్ కార్డ్ డబ్బును జాగ్రత్తగా నిర్వహించుకోవడానికి మీకు అనుమతిస్తుంది. మీకు అవసరమైనప్పుడు, తక్షణ డిమాండ్ల కోసం మీకు క్రెడిట్ యాక్సెస్ ఉంటుంది, ప్రతి కొనుగోలుపై మీరు పొందే అన్ని పొదుపులపై షాపింగ్ ఆఫర్లు అందుతాయి. విక్రమ్ క్రెడిట్ కార్డ్‌ను దేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసినందుకు వారికి అంకితం ఇస్తున్నామని ఆయన అన్నారు.

Updated Date - 2023-01-25T11:54:27+05:30 IST