6 రోజుల తర్వాత బయటపడ్డ ఓ మహిళ మృతదేహం.. ఆమె పొట్టకు ఏడాదిన్నర చిన్నారిని చున్నీతో కట్టి మరీ..

ABN , First Publish Date - 2023-02-06T17:47:42+05:30 IST

ఇంటికి రాకపోవడంతో వెతకగా కాలువ పక్కన మొబైల్ ఫోన్, ఆమె బ్యాగ్ కనిపించాయి. అనుమానం వచ్చి కాలువలో వెతగ్గా..

6 రోజుల తర్వాత బయటపడ్డ ఓ మహిళ మృతదేహం.. ఆమె పొట్టకు ఏడాదిన్నర చిన్నారిని చున్నీతో కట్టి మరీ..

పుట్టింటి నుండి అత్తగారింటికి వెళుతున్న మహిళ రాత్రి 9గంటలు అయినా ఇంటికి చేరలేదు. ఏమయ్యిందోనని ఆమె కోసం వెతికారు కుటుంబ సభ్యులు. ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా వెతగ్గా.. ఓ కాలువ పక్కన మొబైల్ ఫోన్, ఆమె బ్యాగ్ కనిపించాయి. అనుమానం వచ్చి కాలువలో వెతగ్గా 6రోజుల తరువాత మహిళ మృతదేహం బయటపడింది. తల్లీబిడ్డను ఆ పరిస్థితిలో చూసిన అందరికీ మనసులు బరువెక్కుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం బికనేర్ ప్రాంతానికి చెందిన సోను అనే వ్యక్తికి అనిత అనే మహిళకు మూడేళ్ళ క్రిందట పెళ్ళయ్యింది. వీళ్ళిద్దరికి ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగిన కొడుకు సాహిల్ ఉన్నాడు. అనిత పుట్టింటికి వెళ్ళి తిరిగి అత్తగారింటికి బయలుదేరింది. సోనుకు ఫోన్ చేసి వాళ్ళను పికప్ చేసుకోమని సోను బావమరిది చెప్పాడు. అయితే సోను ఆమెను పికప్ చేసుకోవడానికి నిరాకరించాడు. పుట్టింటి నుండి అత్తగారింటికి రాత్రి 9గంటలకే చేరుకోవాల్సిన అనిత చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా వెతగ్గా ఇందిరాగాంధీ కాలువ పక్కన మొబైల్, బ్యాగ్ పోలీసులకు దొరికాయి.

ఆమె కాలువలో దూకి ఉంటుందనే అనుమానంతో కాలువలో చాలా వెతికారు కానీ ఆమె ఆచూకి దొరకలేదు. ఈ క్రమంలో 6రోజుల తరువాత ఆ కాలువలో చాలా దూరంలో అనిత మృతదేహం తేలింది. అప్పటికే అక్కడ ఆ ప్రాంతాల్లో వెతుకుతున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసారు. ఒకటిన్నర సంవత్సరాల తన కొడుకును కడుపుకు చున్నీతో బిగుతుగా కట్టుకుని కాలువలో దూకినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈమె మరణం వెనుక గల కారణాలు ఏమిటో తెలీలేదు. అనిత తన ఫోన్ ను ఫార్మాట్ చేయడం వల్ల పోలీసులకు సరైన సమాచారం దొరకలేదని చెప్పారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకా ఇతర కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T17:47:51+05:30 IST