Telangana politics కాక రేపుతున్న Minister Errabelli కామెంట్స్..గులాబీ బాస్ సీరియస్..?

ABN , First Publish Date - 2023-01-23T12:23:31+05:30 IST

తెలంగాణ రాజకీయాలు ఫుల్ పీక్స్‌లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఊహించలేని పరిస్థితి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది...

Telangana politics కాక రేపుతున్న Minister Errabelli కామెంట్స్..గులాబీ బాస్ సీరియస్..?

వరంగల్‌కు చెందిన ఓ సీనియర్‌ మంత్రి కామెంట్స్ బీఆర్ఎస్‌లో కాక రేపాయా?.. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయా?.. ఆ మంత్రి వ్యవహారాన్ని ఈటల రాజేందర్‌ డీల్‌ చేస్తున్నారా?.. మంత్రి వ్యాఖ్యలపై గులాబీబాస్‌ సీరియస్‌ అయ్యారా?.. ఇంతకీ.. ఎవరా మంత్రి?.. ఆయన చేసిన కామెంట్స్‌ ఏంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1554.jpg

25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందా?

తెలంగాణ రాజకీయాలు ఫుల్ పీక్స్‌లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఊహించలేని పరిస్థితి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. ప్రతీ నియోజకవర్గం అత్యంత కీలకం మారింది. అలాంటి పరిస్థితుల్లో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్‌ పుట్టిస్తున్నాయి. 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చితే బాగుంటుందంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Untitled-1354.jpg

దీంతో.. నిజమేనా?.. అంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నెగటివ్ ఉందా?.. అనే చర్చలు జోరందుకున్నాయి. అంతేకాదు.. ఆ కామెంట్స్‌కు మరింత బలం చేకూరేలా.. తాను సొంతంగా సర్వేలు చేయించానని.. వాటి ఆధారంగానే చెప్తున్నానని మరింత క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఎర్రబెల్లి లాంటి కీలక నేత హాట్‌ కామెంట్స్‌ చేయడంతో బీఆర్ఎస్‌కు డ్యామేజ్ జరిగిందని తెలుస్తోంది. ఒక్కో సీటు ముఖ్యమైన వేళ.. ఆయన పేల్చిన బాంబు.. ప్రగతిభవన్‌లోనూ ప్రకంపనలు రేపింది.

వరంగల్ ఈస్ట్ నుంచి ప్రదీప్‌రావు పోటీ చేస్తారని ప్రచారం

ఇప్పటికే.. దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. వరంగల్ ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే.. పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్‌రావుకు ఈ సారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని టాక్‌ నడుస్తోంది. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో సహజంగానే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది. దీంతోపాటు.. కాంగ్రెస్ తరఫున జంగా రాఘవరెడ్డి అనే బలమైన నేత బరిలో ఉండడం.. ఆయనకు.. దయాకర్‌రావు బద్దశత్రువైన కొండా మురళి అండదండలు దండిగా ఉండడంతో.. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తిలో టఫ్‌ఫైట్ తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఎర్రబెల్లిపైనున్న వ్యతిరేకతకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడైతే.. ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతోంది. అందుకే, బీఆర్ఎస్ కాకుండా బీజేపీ నుంచి పోటీ చేస్తే.. ఫ్రెష్‌ లుక్‌తో.. ఫ్రెష్‌గా గెలవవచ్చనే ఆలోచన చేస్తున్నారని వరంగల్‌ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Untitled-1654.jpg

పాలకుర్తి టికెట్ పక్కా అంటూ ఆఫర్

ఇదిలావుంటే.. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. బలమైన నేతల వేటలో పడింది. ఇప్పటికే దయాకర్‌రావు సోదరుడికి కాషాయ కండువా కప్పేయగా.. అన్నను మాత్రం ఎందుకు వదిలేయాలనే ఆలోచన చేస్తోంది. ఎర్రబెల్లి లాంటి స్ట్రాంగ్ లీడర్‌ను బీజేపీలో చేర్చుకుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందనేది కమలనాథుల లెక్క. దీనికి తగ్గట్టే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని.. పాలకుర్తి టికెట్, మంత్రి పదవి పక్కా అంటూ కమలం పార్టీ నుంచి ఎర్రబెల్లికి ఆఫర్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పాత మిత్రుడు, బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందరే స్వయంగా ఎర్రబెల్లి వ్యవహారాన్ని డీల్ చేస్తున్నారని తెలుస్తోంది.

Untitled-1454.jpg

కేసీఆర్‌కే ఝలక్ ఇచ్చేలా..

మరోవైపు.. సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ పాలసీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అందరికీ టికెట్లు పక్కా అంటున్నారు. కానీ.. కేసీఆర్‌కే ఝలక్ ఇచ్చేలా.. ఎర్రబెల్లి సర్వేలు చేయించడం.. 25 మందిపై వ్యతిరేకత ఉందని మాట్లాడడం చర్చకు దారి తీసింది. ఇంకో అడుగు ముందుకేసి.. వ్యతిరేకత ఉన్నవారిని మార్చాలని వ్యాఖ్యానించారు. పార్టీకి సంబంధించిన కీలక అంశాలను బహిరంగ వేదికపై ప్రస్తావించడం చిన్న విషయమా?.. అందునా.. ఎర్రబెల్లి లాంటి సీనియర్ లీడర్.. లూజ్ టాక్ ఊరికే చేసుంటారా?.. ఇలాంటి ధిక్కార ధోరణిని గులాబీబాస్ సహించగలరా?.. అన్న అనుమానాలు, ప్రశ్నలు తెరపైకి గట్టిగానే వస్తున్నాయి. నిజానికి.. ఏ మామూలు నాయకుడో అయ్యుంటే.. ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుని ఉండేవారు. మంత్రి ఎర్రబెల్లి కావడంతో యాక్షన్ డోసు తగ్గింది. సీనియర్ నేత, బలమైన నాయకుడు, సొంత సామాజికవర్గం.. ఇలా అనేక కారణాలతో కేసీఆర్ కాస్త దయ చూపించారన్న ప్రచారం జరుగుతోంది. సెక్యూరిటీ తగ్గించడం లాంటి చర్యలు చేపట్టకుండా.. ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు టాక్‌ నడుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, అత్యుత్సాహం పనికిరాదని కేసీఆర్‌ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Untitled-19547.jpg

బీజేపీలో చేరి.. ఫ్రెష్‌ లుక్‌లో దర్శనమిస్తారా?..

మొత్తంగా... ఎర్రబెల్లి దయాకర్‌రావు కామెంట్స్‌.. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే.. గులాబీబాస్‌ క్లాస్‌ పీకడంతో.. ఆ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ ఎర్రబెల్లి స్టేట్‌మెంట్ ఇచ్చి ఆ ఇష్యూ నుంచి సైడ్ అయిపోయారు. ఏదేమైనా.. బడా నేతల కోసం బీజేపీ గట్టిగానే వేట సాగిస్తుండడంతో.. బీఆర్ఎస్ నేతల కామెంట్స్‌ చర్చగా మారుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఎర్రబెల్లి నిజంగానే.. బీజేపీలో చేరి.. ఫ్రెష్‌ లుక్‌లో దర్శనమిస్తారా?.. లేక.. బీఆర్ఎస్‌లోనే భవితవ్యం తేల్చుకుంటారా?.. అన్నది చూడాలి మరి.

Untitled-17544.jpg

Updated Date - 2023-01-23T12:31:49+05:30 IST