NRI: ఐర్లాండ్‌లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-01-24T18:22:40+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు టీడీపీ ఐర్లాండ్ విభాగం సభ్యులు ఆధ్వర్యంలో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఘనంగా జరిగాయి.

NRI: ఐర్లాండ్‌లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశాకిరణం, నగదు బదిలీ పథకం రూపకర్త టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు టీడీపీ ఐర్లాండ్ విభాగం సభ్యులు ఆధ్వర్యంలో దేశ రాజధాని డబ్లిన్‌లో ఘనంగా జరిగాయి.

ముందుగా టీడీపీ ఐర్లాండ్ విభాగం సభ్యులు.. జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ప్రద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం రాబోయే తరానికి కాబోయే నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఏపీలో చేసిన అభివృద్ధి, మంత్రి వర్గంలో అయన తెచ్చిన అవార్డులు రివార్డులు, పరిశ్రమల శాఖమంత్రిగా వివిధ దేశాలకు వెళ్లి తెచ్చిన పరిశ్రమల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు. అనంతరం.. కేక్ కట్ చేసి నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం ఉన్నత చదువుల కోసం యూరప్‌లోని వివిధ దేశాల నుండి వచ్చిన వారు టీడీపీ ఎన్నారై విభాగం తమకిచ్చిన చేయూతను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఐర్లాండ్ విభాగం ద్వారా యూరప్‌లోని వివిధ దేశాలలో ఉన్నత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, సహాయ సహకారాల గురించి తమ అనుభూతులను పంచుకున్నారు. యువ నాయకుడు లోకేష్ త్వరలో చేపట్టబోయే సుదీర్ఘ పాదయాత్ర ‘యువగళం’ ద్వారా ప్రజలకు మరింత చేరువై తెలుగుదేశం పార్టీని విజయతీరాలకు చేర్చాలని ఆశిస్తున్నామని తెలిపారు. పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, యువగళం వాల్ పోస్టర్‌ని ఆవిష్కరించారు.

ఉదయం 11 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు వందల మంది ఐర్లాండ్ విభాగం సభ్యులు మహిళలు, యువత మధ్య ఆద్యంతం ఆహ్లాదకరంగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం డా. కిషోర్ బాబు, కృష్ణ ప్రసాద్, నాగ రాజు జూడ, ప్రముఖ్, కిషోర్ మాదల, శివ బాబు, రంగా గల్లా, కోటేంద్ర, శ్రీనివాస్ పుట్టా, లక్ష్మి శ్రీనివాస్, భరత్ భాష్యం, రామ్ వంగవోలు, శ్రీకర్ తదితరులు ఎంతో ఉత్సాహంగా జరిపించారు.

1.jpg

Updated Date - 2023-01-24T18:22:46+05:30 IST