NRI: వర్క్ వీసా అక్కర్లేదు.. జాబ్ ఆఫర్ కూడా అస్సలు అక్కర్లేకుండానే ఉద్యోగాన్వేషణకు ఈ మూడు దేశాలకు వెళ్లొచ్చు..!

ABN , First Publish Date - 2023-03-18T21:40:08+05:30 IST

వర్క్ వీసా లేకపోయినా ఈ మూడు దేశాలకు వెళ్లొచ్చు.. అవేంటో తెలుసా..

NRI:  వర్క్ వీసా అక్కర్లేదు.. జాబ్ ఆఫర్ కూడా అస్సలు అక్కర్లేకుండానే ఉద్యోగాన్వేషణకు ఈ మూడు దేశాలకు వెళ్లొచ్చు..!

ఎన్నారై డెస్క్: సాధారణంగా భారతీయులు విదేశాల్లో జాబ్ కోసం అనేక ఫార్మాలిటీస్ పూర్తి చేయాలన్న విషయం తెలిసిందే. జాబ్ ఆఫర్‌లు, వర్క్ వీసాలు.. ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. కానీ.. ఇలాంటి ప్రయాసలేం లేకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉందా? అంటే ఉందనే అంటున్నాయి కొన్ని దేశాలు! వీసా లేకపోయినా మా దేశానికి రావచ్చంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఇదెలా సాధ్యమంటారా..? అయితే.. జాబ్ సీకర్ వీసాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

జర్మనీ, ఆస్ట్రియా, స్వీడెన్ దేశాలు ఈ జాబ్ సీకర్ వీసాను(Job seeker Visa) ఆఫర్ చేస్తున్నాయి. వివిధ కాలపరిమితులపై జారీ చేసే ఈ వీసాతో విదేశీయులు ఆ దేశాల్లో జాబ్ ఆఫర్ లేకపోయినా కాలుపెట్టవచ్చు. అక్కడికెళ్లాక తీరిగ్గా ఉద్యోగం వెతుక్కోవచ్చు. అయితే..ఈ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు తమ రంగాల్లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. అంతేకాకుండా.. ఆయా దేశాల్లో ఖర్చులకు సరిపడా ఆర్థిక వనరులు సిద్ధం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా రెడీగా ఉండాలి. ఆయా దేశాల్లో గుర్తింపు పొందిన కోర్సులకు సమానమైన డిగ్రీలకే గుర్తింపు ఉంటుంది. జర్మనీలో(Germany) జాబ్ సీకర్ వీసాపై 9 నెలల పాటు నివసించే అవకాశం ఉండగా.. ఆస్ట్రియాలో(Austria) ఆరు, స్వీడెన్‌లో(Sweden) మూడు నెలలు ఉండేందుకు అనుమతి ఉంది.

Updated Date - 2023-03-19T15:50:04+05:30 IST