US: అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా.. నలుగురికి కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2023-02-03T07:37:51+05:30 IST

అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల ప్రాబల్యం పెరుగుతోంది.

US: అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా.. నలుగురికి కీలక బాధ్యతలు

అమెరికా హౌస్‌ కమిటీల్లో నలుగురు భారతీయులు

3 కీలక కమిటీల్లోకి జయపాల్‌, బెరా, కృష్ణమూర్తి, రో ఖన్నా

వాషింగ్టన్‌, ఫిబ్రవరి2: అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల ప్రాబల్యం పెరుగుతోంది. తాజాగా నలుగురు భారతీయ అమెరికన్‌ చట్టసభ్యులు కీలకమైన 3హౌస్‌ కమిటీల్లో సభ్యులుగా నియమితులయ్యారు. ఇమ్మిగ్రేషన్‌ అంశాలపై పనిచేసే శక్తివంతమైన హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ప్యానెల్‌లో సీనియర్‌ సభ్యురాలిగా భారతీయ అమెరికన్‌ మహిళ జయపాల్‌ నియమితులయ్యారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లో నిఘా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటయ్యే హౌస్‌ కమిటీ మరో శక్తివంతమైన కమిటీ. 57 ఏళ్ల భారతీయ అమెరికన్‌ ‘బెరా’ ఆ కమిటీలో సభ్యురాలిగా నియమితులయ్యారు. చైనా కమ్యూనిస్టు పార్టీ, అమెరికా మధ్య వ్యూహాత్మక పోటీ వ్యవహారాలను పరిశీలించే హౌస్‌ సెలక్ట్‌ కమిటీలో సీనియర్‌ సభ్యుడిగా భారతీయ అమెరికన్‌ కృష్ణమూర్తి, మరో భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా సభ్యుడిగా నియమితులయ్యారు.

Updated Date - 2023-02-03T07:37:53+05:30 IST