బరువు తగ్గించే పానీయం

ABN , First Publish Date - 2023-01-09T00:26:13+05:30 IST

బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన ఆహార శైలితోపాటు కొన్ని కొవ్వు కరిగించే...

బరువు తగ్గించే పానీయం

బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన ఆహార శైలితోపాటు కొన్ని కొవ్వు కరిగించే పానీయాలను కూడా తీసుకోవాలి. అలాంటివాటిలో ‘అల్లం నీళ్లు’ మెరుగైనవి. ఈ పానీయం ఎలా తయారుచేయాలంటే?

కావలసిన పదార్థాలు:

అల్లం పొడి - 1 టీ స్పూను

తేనె- 1 టేబుల్‌ స్పూను

నిమ్మరసం- 1 టేబుల్‌ స్పూను

కలబంద గుజ్జు- 2 టేబుల్‌ స్పూన్లు

నీళ్లు - 1 గ్లాసు

తయారీ విధానం:

- నీళ్లలో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి.

- కలుపుతున్నప్పుడే నిమ్మరసం కూడా వేయాలి.

- చివర్లో అల్లం పొడి, తేనె కూడా వేసి కలిపి, పరగడుపునే తాగాలి.

- ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే మార్పు స్పష్టంగా తెలుస్తుంది.

Updated Date - 2023-01-09T00:26:14+05:30 IST