ఒత్తిడి తగ్గాలంటే...

ABN , First Publish Date - 2023-01-24T23:04:51+05:30 IST

ఒత్తిడి పూర్తిగా పోదు కానీ తగ్గించే కొన్ని చిట్కాలున్నాయి. అవి కూడా పాటిస్తేనే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇరిటేషన్స్‌, బాధలు పక్కనబెట్టి ఆందోళన, ఒత్తిడి నుంచి రిలాక్స్‌ కావాలంటే ఇవి పాటించాల్సిందే.

ఒత్తిడి తగ్గాలంటే...

ఒత్తిడి పూర్తిగా పోదు కానీ తగ్గించే కొన్ని చిట్కాలున్నాయి. అవి కూడా పాటిస్తేనే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇరిటేషన్స్‌, బాధలు పక్కనబెట్టి ఆందోళన, ఒత్తిడి నుంచి రిలాక్స్‌ కావాలంటే ఇవి పాటించాల్సిందే.

  • ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ప్రజంట్‌లో ఉండేందుకు మెడిటేషన్‌ చేయటం అద్భుతమైన చిట్కా. మెదడులో ఏవో చేదు జ్ఞాపకాలు, భవిష్యత్‌ గురించి ఆందోళనలు ఉంచుకోకుండా ఆలోచనల్ని కట్టడిచేసి శరీరాన్ని తేలికగా ఉంచాలంటే మెడిటేషన్‌ తప్పనిసరి. లుక్‌-పాయింట్‌-నేమ్‌-గేమ్‌ లాంటి మెడిటేషన్‌ టెక్నిక్‌ ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి తగ్గిపోతుంది.

  • ఖాళీ కాగితాల్లో బొమ్మలు వేయటం, పెయింటింగ్స్‌ వేయటం.. చిన్న చిన్న యాక్టివిటీలు చేయటం వల్ల కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. ఫన్నీగా అనిపిస్తున్నాయా? పిల్లల్లా ఏంటీ? అనుకుంటున్నారా.. ఏం పర్లేదు.. మీరు హ్యాపీగా అన్ని మర్చిపోతారు ఆ కొద్దిసేపు. పెయింటింగ్‌ అలవాటుగా చేసుకున్నా సరే మీలో స్ర్టెస్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి.

  • ఒకేచోట ఉంటే మెదడు పలురకాల ఆలోచనలు చేస్తుంది. అందుకే వాకింగ్‌ చేస్తే మూమెంట్‌ ఉంటుంది. శరీరం కదలడం వల్ల కామ్‌నెస్‌ వస్తుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. దీనివల్ల చురుకైన ఆలోచనలు వస్తాయి.

  • ఒత్తిడి ఎక్కువగా ఉంటే అతిగా తింటారు. స్వీట్స్‌, మాంసాహారం మీద అమితాసక్తి చూపిస్తారు. విచిత్రమేంటంటే.. మీకు ఇష్టమైన ఫుడ్‌ను హాయిగా ఆస్వాదిస్తూ మెల్లగా తినటం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.

  • పిల్లలతో ఆడుకోవడం, డాగ్స్‌తో పాటు పిల్లులు, పక్షులతో ఆడుకోవటం లాంటివి చేస్తే ఒత్తిడి చిత్తవుతుంది. నచ్చినపని చేసినా ఒత్తిడి కనపడదు. సంగీతం వినటంతో పాటు కొత్త ప్రదేశాలకు వెళ్లటం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.

Updated Date - 2023-01-24T23:04:53+05:30 IST