బరువు తగ్గాలంటే..

ABN , First Publish Date - 2023-02-02T02:26:00+05:30 IST

చక్కెరశాతం ఎక్కువ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా స్వీట్స్‌కు దూరంగా ఉండాలి.

బరువు తగ్గాలంటే..

  • చక్కెరశాతం ఎక్కువ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా స్వీట్స్‌కు దూరంగా ఉండాలి.

  • పిండిపదార్థాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అధికంగా రైస్‌ తినటం తగ్గించాలి. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌కు జోలికి వెళ్లకూడదు. ఫ్రైడ్‌ ఫుడ్‌ను తక్కువగా తినాలి. ముఖ్యంగా ఆకలిగా ఉన్నప్పుడే తినాలి.

  • ఉదయాన ప్రొటీన్‌ఫుడ్‌ తీసుకోవాలి. జిమ్‌, వర్కవుట్స్‌ కచ్చితంగా చేయాలి. రాత్రిపూట 7 గంటలలోపే తినాలి.

  • ఏడు గంటల నిద్ర తప్పని సరి.

  • తాజా కూరగాయలు, పండ్లు తినాలి. ఫ్రిజ్‌లో రోజుల పాటు ఉండే ఆహారాన్ని తినకూడదు.

  • పండ్లరసాలు తాగే బదులు పండ్లను తినటం మంచిది. టీవీ ముందు కూర్చుని భోజనం తినకూడదు. ఇలా చేస్తే ఎంత తింటున్నామో అర్థం కాదు. ఒకేసారి అధికశాతంలో ఆహారం తినకుండా ఆకలయినపుడు కొంచెం కొంచెం తినాలి.

  • మాంసాహారం, చేపలు, గుడ్లు లాంటివి తినకుండా కడుపు మాడ్చుకోనవసరం లేదు. అయితే మితంగా తినాలి.

  • ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ఫ్రైడ్‌ రైస్‌ లాంటి వాటికి దూరంగా ఉండాలి.

Updated Date - 2023-02-02T02:26:02+05:30 IST