OHRK: అలా చేసుంటే... ఇంతకంటే సక్సెస్‌ అయ్యేవాణ్ణి

ABN , First Publish Date - 2023-01-09T00:22:41+05:30 IST

చూడటానికి హీరో లుక్స్‌... ఇరవయ్యేళ్ల వయసులోనేఇండస్ర్టీకి వచ్చాడు.చిన్నచితకా పాత్రలు చేస్తూ... ‘

OHRK: అలా చేసుంటే... ఇంతకంటే సక్సెస్‌ అయ్యేవాణ్ణి

చూడటానికి హీరో లుక్స్‌... ఇరవయ్యేళ్ల వయసులోనేఇండస్ర్టీకి వచ్చాడు.చిన్నచితకా పాత్రలు చేస్తూ... ‘విక్రమార్కుడు’తో ప్రతినాయకుడి పాత్రలకు పాపులర్‌ అయ్యాడు. క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా విజయకేతనం ఎగరేస్తున్న అజయ్‌... ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పంచుకున్న విశేషాలివి...

  • ఆర్కే: ఇండస్ర్టీలోకి వచ్చి ఇరవై ఏళ్లు. బ్యాడ్‌ బాయ్‌ రోల్స్‌ ఎక్కువ. బయట మిమ్మల్ని చూసినవారు ఎలా ఫీలవుతుంటారు?

  • అజయ్‌: ‘విక్రమార్కుడు’ చిత్రం తర్వాత మా ఇంట్లో పిల్లలు కూడా దగ్గరకు రాలేదు. ‘టిట్లా’ క్యారెక్టర్‌ ఇంపాక్ట్‌ అది. మహిళలు రియాక్టయ్యే విధం వేరుగా ఉండేది. ఒకరకంగా కాంప్లిమెంట్‌. ఈ చిత్రం వచ్చి 15 ఏళ్లు అయినా ‘టిట్లా’ను గుర్తు పెట్టుకున్నారు. రాజమౌళిగారు ఆ పాత్రను అంత స్ర్టాంగ్‌గా డిజైన్‌ చేశారు.

  • ఆర్కే: మీ ఆవిడ భయపడ్డారా ఏంటీ?

  • అజయ్‌:ఇంట్లో మనం భయపడటమే ఉంటుంది (నవ్వులు).

  • ఆర్కే: ఒకే పాత్రలు చేస్తే మొనాటమీ వస్తుంది కదా!

  • అజయ్‌: స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్‌ సీన్స్‌లో ఫైట్స్‌ ఉండేవి. లేదా ఒక సీన్‌ కొట్టడం మాత్రమే ఉండేది. అన్నీ విలన్‌ రోల్స్‌ చేస్తుంటే.. మొనాటమీ వచ్చేది. బోర్‌ కొట్టేది. అయితే మంచి పాత్రలు వస్తాయనే హోప్‌తో ముందుకెళ్లా. అలా ‘ఇష్క్‌’, ‘దిక్కులు చూడకు రామయ్య’లో మంచి పాత్రలొచ్చాయి.

  • ఆర్కే: ఫలానా పాత్ర అని అనుకుంటే అజయ్‌ గుర్తుకురావాలి!

  • అజయ్‌: కచ్చితంగా. తమిళం రాకున్నా ఇటీవలే నాలుగు తమిళ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. అందులో అజిత్‌ ‘తెగింపు’, జయం రవి సినిమా ఉంది. ఇండస్ర్టీలో సెట్‌ అయితే ఎక్కడో ఎవరోఒకరు చూసి ఇలా అవకాశాలు ఇస్తారు.

  • ఆర్కే: మీ హైట్‌ కూడా మీకు కలిసొచ్చిందేమో..!

  • అజయ్‌: హైట్‌గా ఉన్నాననే వచ్చా. నా హైట్‌ 6.2 అడుగులు.

  • ఆర్కే: కొందరు హీరోలు ఐదున్నరడుగులుంటారు. మీతో ఫైట్‌ చేసేప్పుడు వాళ్లకు అన్‌కంఫర్ట్‌గా అనిపించదా..!

  • అజయ్‌:ఫస్ట్‌లో ఫ్రెండ్‌ వేషాలు చేసేప్పుడు నేను ప్రార్థించేవాణ్ణి... కాస్త పొడుగుండే హీరోలు రావాలని! ప్రభాస్‌, మహే్‌షబాబుకైతే సరిపోతా. అయితే విలన్‌ రోల్స్‌ మాత్రం ఎవరికైనా సరిపోతాయి. ఎందుకంటే విలన్‌ స్ర్టాంగ్‌గా ఉండాలి.

  • ఆర్కే: పాత రోజుల్లో విలన్స్‌ భయంకరంగా ఉండేవాళ్లు. ఈ రోజుల్లో హీరోలకంటే విలన్స్‌ అందంగా ఉంటున్నారు..?

  • అజయ్‌: మన ఆడియన్స్‌కి విలన్స్‌ కూడా అందంగా ఉండాలి. ఈ మధ్య హీరోలే విలన్‌ రోల్స్‌ కూడా చేసేస్తున్నారు. మా వరకూ ఆ పాత్రలను ఎక్కడ రానిస్తున్నారు?

  • ఆర్కే: అదీ కరెక్టే!

  • అజయ్‌: ఈ పాతికేళ్లలో మూడు జనరేషన్స్‌ బాంబే విలన్స్‌ వచ్చి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో జనరేషన్‌ విలన్స్‌ను చూస్తున్నాం. నేను, సుబ్బరాజు ఇంకా ఉన్నామిక్కడ. మా ఇద్దరి ప్రయాణం దాదాపు ఒకే సమయంలో ప్రారంభమైంది.

  • ఆర్కే:మీది విజయవాడ కదా? ఈ సినిమా ఎలా అబ్బింది?

  • అజయ్‌:విజయవాడ పక్కన క్రిష్ణయ్యపాలెం. ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. 1994 సమయంలో నేను బిటెక్‌ చేసి ఇంజనీర్‌ అవ్వాలని మా నాన్నకు ఉండేది. ఎమ్‌సెట్‌లో ర్యాంకు రాలేదు. లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నా సరైనా ర్యాంకు రాలేదు. ఎమ్‌సెట్‌కి ప్రిపేర్‌ అయ్యేపుడు సినిమా షూటింగ్‌ చూశా. సినిమా యాక్టర్స్‌కు గొడుగులు పట్టుకుని ఉండటం చూసి బావుందనుకున్నా. అలా ఆసక్తి వచ్చింది. ఎమ్‌సెట్‌లో ర్యాంక్‌ రాకున్నా నాగపూర్‌లోని ఇంజనీరింగ్‌ కాలేజీలో డబ్బులు కట్టి చేర్పించినా.. వెనక్కి వచ్చేశా.

  • ఆర్కే: ఈ ఫీల్డ్‌కు వస్తోంటే మీ నాన్న ఏమీ అనలేదా?

  • అజయ్‌: కంఫర్ట్‌గా ఫీల్‌ కాలేదు.

  • ఆర్కే:మధ్యలో నేపాల్‌ ఎందుకు పారిపోయారు?

  • అజయ్‌: పదిహేడేళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా.. స్నేహితుడితో కలసి నేపాల్‌ వెళ్లిపోయాను. మంచుకొండలు చూడాలనే ఆసక్తి బాగా ఉండేదప్పుడు. 14గంటలు ప్రయాణం చేసి ఖఠ్మండు వెళ్లాం. బాగా తిరిగాక తీసుకెళ్లిన డబ్బులు అయిపోయాయి. ఒక నేపాలీ రెస్టారెంట్‌లో పని చేసి సంపాదించి తిరిగి ఇంటికొచ్చేశాం.

  • ఆర్కే: హోటల్‌లో గిన్నెలు కడిగితే కానీ జ్ఞానోదయం రాలేదు!

  • అజయ్‌: అవును సర్‌ (నవ్వులు). జీవితం ఎంత కష్టమో, డబ్బు విలువ ఏంటో తెలిసొచ్చింది. తెలిసీ తెలియని వయసులో అలా జరిగిపోయింది. నెలరోజులు కాబట్టి ఇంట్లో కొట్టలేదు... మళ్లీ వెళ్లిపోతానేమోనని(నవ్వులు).

  • ఆర్కే: గాడ్‌ఫాదర్‌ లేకున్నా కృష్ణానగర్‌కి ఎలా వచ్చారు?

  • అజయ్‌: ఆ ఫార్ములా తెలిస్తే చాలా మంది క్రాక్‌ చేస్తారు. ఎలాంటి ఐడియా లేదు. కేవలం లక్‌. టాలెంట్‌ తర్వాత విషయం. ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నప్పుడే ‘ఖుషీ’, ‘ఒక్కడు’ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత ‘విక్రమార్కుడు’లో నటించా. హీరోగా చేసిన ‘సారాయి వీర్రాజు’ తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా.

  • ఆర్కే: అసలు హీరోగా ఎందుకు చేశారు?

  • అజయ్‌: ‘విక్రమార్కుడు’ తర్వాత చేయటం వల్లనేమో.. వర్కవుట్‌ కాలేదు. అదృష్టం కలిసిరాలేదు. ఒకవేళ హీరోగా చేయకుంటే మాత్రం బాధపడేవాణ్ణి. హీరోగా కుదరదని.. మళ్లీ నా మార్కెట్‌లోకి ఎంటరయ్యా.

  • ఆర్కే: ఫస్ట్‌ సినిమా అవకాశం ఎప్పుడొచ్చింది..?

  • అజయ్‌: ‘కౌరవులు’ సినిమా దర్శకుడు నాన్నకు తెలీటం వల్ల అవకాశం వచ్చింది. పదిహేను రోజులు షూటింగ్‌ చేస్తే పదివేల రూపాయలు ఇచ్చారు. ‘ఖుషీ’కి 15వేలు డబ్బులిచ్చారు. దానికంటే ముందు జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వాలంటీర్‌గా 150 రూపాయలకు పనిచేశా. మనల్ని చూసి అవకాశాలు ఇస్తారనే ఆశతో పని చేశా. అక్కడ కుదర్లేదు.

  • ఆర్కే: మీరు కష్టాలు పడ్డారా?

  • అజయ్‌: ‘విక్రమార్కుడు’ వరకు కనీసం పదిహేను సినిమాలు చేసుంటా. అసిస్టెంట్‌ దర్శకులుగా రాజమౌళి, వినాయక్‌గారు స్టార్ట్‌ అయినపుడే నేను స్టార్ట్‌ అయ్యా. వాళ్లతో పాటు ప్రయాణించా. నెక్ట్స్‌ బంచ్‌ హరీష్‌ శంకర్‌, వంశీపైడిపల్లి, సురేందర్‌రెడ్డి, కొరటాల శివ ఉన్నారు. లక్‌ ఏంటంటే... వాళ్లంతా సక్సెస్‌ అవటం.. నేను ముందుకెళ్లటం జరిగింది. రాజమౌళిగారు మాత్రం నాకు అవకాశాలిచ్చి ఎంకరేజ్‌ చేశారు. ‘విక్రమార్కుడు’ వరకూ.. విలన్‌ రోల్‌ ఇవ్వమని ఆయన్ని బాగా విసిగించేవాణ్ణి.

  • ఆర్కే: మీ ఇద్దరికీ ఎక్కడ పరిచయం?

  • అజయ్‌: ‘ఖుషీ’ చిత్రంలో చూసి ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’ కోసం పిలిచారు. అప్పటి వరకూ ఆయనతో బయట పరిచయం లేదు. ‘విక్రమార్కుడు’లో కథ లైన్‌ తెలిశాక ఒక నెగటివ్‌ రోల్‌ ఇస్తే చాలనుకున్నా. అయితే ‘టిట్లా’ క్యారెక్టర్‌ నాకొచ్చింది. ఆ విలన్‌ గెటప్‌ ఫైనల్‌ చేయడానికి రెండు రోజులు పట్టింది. 45 డిగ్రీల ఎండలో ప్రతి షాట్‌కు దుమ్ము వచ్చి కళ్లలో పడేది. అది చేయగలిగానంటే ఏదైనా చేస్తాననుకున్నా. ఈ రోజుకీ ఆ కష్టం ఇంపాక్ట్‌ ఉంది.

  • ఆర్కే: మీకేమైనా సినిమాల్లో దెబ్బలు తగిలాయా?

  • అజయ్‌: ‘విక్రమార్కుడు’ క్లైమాక్స్‌ ఫైట్‌లో రవితేజగారు ఇద్దరిని చంపి యాంకర్‌ వెయిట్‌ ఉంటే.. నేను పైకి రావాలి. ఇది సీన్‌. ప్లాన్‌ ఏంటంటే నేను దూకుతాను ఫస్ట్‌. అనుష్కకు గన్‌ పెడతాను. కౌంటర్‌ వెయిట్‌ వేయగానే నేను పైకి వెళ్లిపోవాలి. నాకు డబుల్‌ వెయిట్‌ వేయాలి కాబట్టి క్రేన్‌ వెయిట్‌ కట్టారు. ఆపరేట్‌ చేసే వారికి విజువల్‌ కనపడదు. అతను మార్క్‌ చేసుకుని బ్రేక్‌లో కొట్టాలి. యాక్షన్‌ అనగానే ఆ రోప్‌లను పట్టుకొనేవాడు వదిలేసి పక్కకు వెళ్లిపోయాడు. క్రేన్‌ వెయిట్‌ నా కాలి మీద పడింది. కాలు రగ్బీబాల్‌లా వచ్చిపోయింది. మానిటర్‌ చూస్తున్న రాజమౌళిగారు క్షణాల్లోనే ‘చచ్చాడు’ అంటూ పరిగెత్తుకొచ్చారు. ఆ క్షణంలో ఇంట్లో వాళ్లంతా గుర్తుకు వచ్చారు. ఇన్నేళ్లుగా గాల్లో ఫైట్లు చేస్తూ ఉన్నా. ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎన్నో గుర్తులు. ప్రస్తుతం పాజిటివ్‌ రోల్స్‌ వస్తున్నాయి. ఇప్పుడు తన్నులు తగ్గించేశారు.

  • ఆర్కే: మీకు ఓటీటీలు కలిసొచ్చాయా?

  • అజయ్‌: ఓటీటీల్లో ఎప్పుడూ చేయని పాత్రలూ చేయవచ్చు. రీ డిస్కవర్‌ చేసుకోవచ్చు. గ్రే షేడ్స్‌ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కి గ్రాఫ్‌ ఉంటుంది. ‘9 హవర్స్‌’లో డిఫరెంట్‌ పాత్ర చేశా. ఇప్పుడు టాలెంట్‌ ఉంటే ఓటీటీలో మంచి పేరొస్తుంది. ‘పాతాళ్‌ లోక్‌’లో నటించిన శరత్‌ గారికి ఫస్ట్‌ సిరీ్‌సలో అరవై లక్షలు పారితోషికం ఇచ్చారు. పార్ట్‌ 2కు ఇరవై కోట్లు ఇచ్చారట. ప్రతిభ ఉంటే.. డబ్బులు ఎంత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీల వల్ల ఆడియన్స్‌లో ఇంటెలిజన్స్‌ పెరిగింది. ఇంటర్‌నేషనల్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల సినిమాలు కూడా ఆ రేంజ్‌లో ఉండాలనుకుంటున్నారు.

  • ఆర్కే: మీకు వచ్చిన మంచి పాత్రలేవీ?

  • అజయ్‌: ‘దళం’, ఆ తర్వాత ‘విరోధి’ అనే సినిమాకి కష్టపడ్డా. ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘ఇష్క్‌’లో లాంటి పాత్రలు డిఫరెంట్‌. అందులో క్యారెక్టర్‌ చెడిపోతే సినిమానే పోతుంది. ‘విక్రమార్కుడు’ ఫిజికల్లీ చాలెంజ్‌.

  • ఆర్కే: రేప్‌ సీన్లు చేయటానికి ఇష్టపడేవాళ్లు కాదట..!

  • అజయ్‌:ఇబ్బందిగా అనిపించేది. 80 శాతం రోల్స్‌ నాకు ముందు తెలీదు. ఒక రోజు షూటింగ్‌కు వెళ్లా. కెమెరా రోల్‌ అవుతోంది. ఎదురుగా ఒక మోడల్‌. ఆమెతో రేప్‌సీన్‌. ఆ సీన్‌ ఉందని ఆమెకు తెలియదట. ఆమె ‘డోంట్‌ టచ్‌మీ’ అంటోంది. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే.. ఆ సీన్‌నే మార్చేశారు. ఆ తర్వాత పాత్ర వినకుండా చేయటం మానేశా.

  • ఆర్కే: మీది అదృష్టం అన్నమాట..!

  • అజయ్‌: కెరీర్‌ సస్టయిన్‌ కోసం స్ట్రగుల్‌ పడ్డా. బేసిక్‌గా బిజినెస్‌ చేయలేను. ఒక కంపెనీ పెట్టి 30 లక్షలు ఖర్చుపెట్టా. త్వరగా తెలుసుని రియలైజ్‌ అయ్యా. ప్రతి క్యారెక్టర్‌ ఆర్టిస్టిక్‌కు ఇబ్బందులు వస్తాయి. యంగ్‌ విలన్‌ తర్వాత ఫాదర్‌ రోల్స్‌ చేయలేను. ఇప్పుడు నా వయసు 45 ఏళ్లు. యాభై వస్తే ఫాదర్‌ రోల్స్‌ చేసుకుంటా.

  • ఆర్కే: అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న రోజులున్నాయా?

  • అజయ్‌: అవకాశాలు లేని సమయాల్లో ఇంట్లో వాళ్లతో కలిసి ట్రావెలింగ్‌ చేశా. ‘విక్రమార్కుడు’ తర్వాత ఒక్క సీన్‌తో మళ్లీ ప్రారంభించిన సందర్భాలున్నాయి. ఆ ఫేజ్‌ అర్థం కాక.. ఒక్క సీన్‌ వచ్చినా చేసేవాణ్ణి. జడ్జ్‌ చేయకుండా వచ్చింది వచ్చినట్లు పలు పాత్రల్లో నటించా... ఈ రేప్‌ల పాత్రలు తప్ప.

  • ఆర్కే: స్టడీ్‌సలో బ్యాడ్‌బాయ్‌. మామూలుగా గుడ్‌బాయ్‌ కదా!

  • అజయ్‌:ఎలాంటి కంప్లయింట్స్‌ రాలేదు. చిన్న వయసులోనే ఇక్కడకు రావటంతో.. మనుషులను జడ్జ్‌ చేసే గుణం వచ్చింది. ఈ ఫీల్డ్‌లో సక్సెస్‌ అయితే ఎక్కడయినా సక్సెస్‌ అవ్వచ్చు. ఫ్యూచర్‌ కనిపించదు. ఇక్కడకు రావాలంటే మెంటల్‌ స్ర్టెంగ్త్‌ ఉండాలి.

  • ఆర్కే: ఈ జనరేషన్‌ వాళ్లు బిజినె్‌సలు పెట్టుకున్నారు కదా..!

  • అజయ్‌:కెరీర్‌లోకి వస్తూనే కొత్తతరం వాళ్లు ఇన్వె్‌స్టమెంట్స్‌ చేస్తూ స్మార్ట్‌గా ఉంటున్నారు. పదేళ్లు ముందే ఆలోచిస్తున్నారు.

  • ఆర్కే: 22 ఏళ్ల జర్నీలో రిగ్రెట్‌ ఫీలయ్యారా..?

  • అజయ్‌: ఇంత ఎఫర్ట్‌, ఎనర్జీ, ఇంత సమయం.. ఇక్కడ కాక వేరేచోట పెట్టి ఉంటే ఇంతకంటే సక్సెస్‌ అయ్యేవాణ్ణేమో అనిపిస్తుంది. ఇక్కడ టైమింగ్స్‌ ఉండవు. హీరోకు నిద్రలేకుంటే షూటింగ్‌ క్యాన్సిల్‌ అవుతుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు ఆ ఫెసిలిటీ ఉండదు. ఎవరూ పట్టించుకోరు. మొదట్లో కొంచెం బాధగా ఉండేది. ఒక ప్రొసీజర్‌ అలవాటైంది. బాయ్‌, మేనేజర్‌, మేక్‌పమాన్‌ పెట్టుకోమనే వరకూ.. పనిచేసుకుంటూ వెళ్లిపోయా. మంచి హోటల్‌ ఇవ్వాలని అనుకోను. ఇక్కడ మంచి పాత్ర దొరికితే చాలనుకున్నా. నాకు హోటల్‌ రూమ్‌ నచ్చకుంటే నా డబ్బులతో వేరేది తీసుకుంటా. అది చిన్న విషయంలా కనపడుతుంది. చిన్నదానికి ఇష్యూ చేస్తే వేరే ఇబ్బందులు వస్తాయి. ఈ ఫీల్డ్‌ బోర్‌ కొట్టదు. డెస్క్‌ జాబ్‌లా ఉండదు. ప్రతిరోజూ కొత్త జనాలతో కలవటం.. కొత్త లొకేషన్‌కు వెళ్లటం జరుగుతుంది. అందుకే సినిమా వాళ్లు వేరే పనిలోకి వెళ్లరు. ఆ అడిక్షన్‌ వేరు. ఇక్కడే రిటైర్‌ అవ్వాలి.

  • ఆర్కే: ఈ ప్రయాణంలో చేదు అనుభవాలున్నాయా..?

  • అజయ్‌: ఇక్కడ ఏమీ ప్రిడిక్ట్‌ చేయలేం. ఆల్టర్‌నేట్‌ లేదనే స్ర్టెస్‌ ఉండేది. పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఇబ్బందిగా ఉండేది. ‘విక్రమార్కుడు’ వచ్చేంత వరకూ స్ట్రగుల్‌ ఉండేది. చదువుకోకపోవడం ఎంత తప్పనేది తెల్సింది. నేను ఎప్పుడూ హై చూడలేదు. స్టేబుల్‌ అండ్‌ స్టడీగా ఉన్నా.

  • ఆర్కే: విలన్‌ రోల్స్‌కు బాడీ ఫిట్‌గా ఉండాలి కదా..!

  • అజయ్‌:హైట్‌వల్ల పొట్ట కనపడలేదు.నలభైల్లోకి వచ్చాక ఫిట్‌నెస్‌ లెవల్స్‌ తెలుస్తున్నాయి. చేజింగ్‌ సీన్‌ చేయలేకపోయా. దీంతో స్మోకింగ్‌, మందు మానేశా. ఇప్పుడు సినిమాలు, జిమ్‌తో హ్యాపీ.

  • ఆర్కే: ప్లాన్‌-బి ఏమైనా ఉందా?

  • అజయ్‌: ఫుడ్‌ బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నా. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పీక్‌ స్టేజ్‌ వస్తే చూడాలి. అందుకోసమే ఎదురుచూస్తున్నా.

అనుకున్నట్లు కెరీర్‌ నడిచింది. ఫ్యామిలీ, పిల్లలూ. మాది లవ్‌ మ్యారేజ్‌. తను కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలిసింది. ఒకరికొకరు ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. ఏమీ లేనప్పుడు నాతోనే ఉంది తను. నేను సక్సెస్‌ అవుతానని తనకు నమ్మకం. అంత కంటే రైట్‌ పర్సన్‌ ఎవరుంటారు? తను ఫ్యాషన్‌ డిజైనర్‌. మిసెస్‌ ఇండియా కాంటె్‌స్టకి వెళ్లింది. అందుకోసం సంవత్సరంలో 30 కేజీల బరువు తగ్గింది. ఆ కాంటె్‌స్టకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేసింది. హౌస్‌వైఫ్‌ అయినా పార్ట్‌టైమ్‌గా జ్యువెలరీ డిజైనర్‌గా పని చేస్తోంది. నేను లేజీగా ఉండేవాణ్ణి. తన వల్ల నాకు జిమ్‌ అలవాటైంది.

ఇరవై ఏళ్ల వయసులోనే ఇండస్ర్టీలోకొచ్చా. మధుఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ఆరు నెలల్లో వదిలేశా. అప్పటికే ఇంజనీరింగ్‌ డ్రాపవుట్‌. నాసిక్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి వదిలేశా. విజయవాడలో సీఏలో జాయిన్‌ చేశారు మానాన్న. అక్కడా ఉండలేదు. అందుకే సినిమాల్లో అయినా ఉండాలనుకున్నా.

Updated Date - 2023-01-09T07:41:19+05:30 IST