Online Order: ఆర్డర్ చేసి బిర్యానీ వంటి వాటిని తెగ లాగించేస్తున్నారా..? తిన్న వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే..!

ABN , First Publish Date - 2023-01-23T14:12:36+05:30 IST

ప్యాక్ చేసిన ఆహారం గడువు, తయారీ తేదీని చూసిన తర్వాత మాత్రమే కొనండి

Online Order: ఆర్డర్ చేసి బిర్యానీ వంటి వాటిని తెగ లాగించేస్తున్నారా..? తిన్న వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే..!
food poisoning

ఆకలవగానే వంటచేసుకుని తినే టైంగానీ, తీరికగానీ లేని బిజీ లైఫ్ లు అయిపోతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకుని ఆన్లైన్ లో తినేస్తూ ఉంటాం. అయితే ఈ ఆహారం ఎంతవరకూ నాణ్యంగా ఉందనేది పట్టించుకోం. ఇలా ఆర్డర్ చేసి తినే ఆహారంతో అనారోగ్యాలు వచ్చినా ఈ పద్దతిని మాత్రం మార్చుకోవడం లేదు. ఈమధ్య కాలంలో 20 ఏళ్ళ యువతి ఇలా తినే దాదాపు చావు వరకూ వెళ్ళింది. ఫుడ్ పాయిజనింగ్ అయితే దాని నుంచి ఎలా బయటపడాలనేది చూద్దాం.

1. బయటి ఆహారంతో కలిగే ఫుడ్ పాయిజనింగ్ ఆహారం లక్షణాలు..

  1. కడుపు నొప్పి

  2. అతిసారం

  3. వాంతులు అవుతాయి.

  4. వికారం

  5. జ్వరం

  6. dehydration

  7. ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దు, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

2. ఫుడ్ పాయిజనింగ్ మరణానికి ఎందుకు కారణం అవుతుంది?

ఫుడ్ పాయిజనింగ్ కొన్నిసార్లు తీవ్రమైన డయేరియా, కామెర్లు, విరేచనాలకు దారితీస్తుంది. వాటిని సకాలంలో నియంత్రించకపోతే, మరణం కూడా సంభవించవచ్చు. ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా పేగుల్లో అల్సర్ వస్తుంది.

3. రెస్టారెంట్లు, బయటి దుకాణాలు, ప్యాక్ చేసిన ఆహారాలు మంచివా?

ఏ రకమైన ఆహారమైనా వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉంటుంది. ఈ కోణంలో, ప్యాకేజ్డ్ ఫుడ్ కంటే ఆది రెస్టారెంట్ ఫుడ్ చాలా బెటర్. ప్యాక్ చేసిన ఆహారాన్ని నిల్వ చేయడానికి అనేక రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు మన శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. ప్యాక్ చేసిన ఆహారం గడువు, తయారీ తేదీని చూసిన తర్వాత మాత్రమే కొనండి. ఈ ముఖ్యమైన సమాచారం లేని ప్యాక్ చేసిన వస్తువులను కొనుగోలు చేయవద్దు.

4. ఫుడ్ పాయిజనింగ్ జరిగితే ఏం చేయాలి?

  1. ఫుడ్ పాయిజనింగ్ జరిగితే... విశ్రాంతి తీసుకోండి.

  2. నీరు పుష్కలంగా త్రాగాలి, తద్వారా శరీరంలో నీటి స్థాయి మెరుగ్గా ఉంటుంది.

  3. అరటిపండు, గంజి వంటి తేలికపాటి ఆహారాన్ని తినండి.

  4. ORS నీటిని తాగుతూ ఉండండి.

  5. మరీ విషమంగా ఉంటే అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Updated Date - 2023-01-23T14:13:48+05:30 IST