Slow Loris : స్లో లోరిస్‌

ABN , First Publish Date - 2023-01-27T06:45:47+05:30 IST

గుండ్రని కళ్లు ఉండే ఈ జంతువు చూడటానికి కోతి, ముంగిసలా కనిపిస్తుంది. దీని పేరు ‘స్లో లోరిస్‌’. పాములా మెల్లగా కదలటం వల్ల స్లో అనే పేరును తగిలించారు. ఇందుకు ఓ కారణం ఉంది.

Slow Loris : స్లో లోరిస్‌

  • గుండ్రని కళ్లు ఉండే ఈ జంతువు చూడటానికి కోతి, ముంగిసలా కనిపిస్తుంది. దీని పేరు ‘స్లో లోరిస్‌’. పాములా మెల్లగా కదలటం వల్ల స్లో అనే పేరును తగిలించారు. ఇందుకు ఓ కారణం ఉంది. వీటి వెన్నెముక నిర్మాణం వల్ల అలా చిన్నగా కదిలినట్లు నడుస్తుంది.

  • తూర్పు కొలంబియా, ఇండోనేషియా, వియత్నాం, దక్షిణ చైనాలోని రైన్‌ఫారెస్టుల్లో జీవిస్తాయివి. 8 నుంచి 18 సెంటీమీటర్ల పొడవుంటాయి.

  • ఫ వీటి పెద్దకళ్ల వల్ల చూపు బావుంటుంది. చెట్లమధ్య వెలుతురు తక్కువ ఉన్నా స్పష్టంగా చూపు కనిపిస్తుంది. విచిత్రమేంటంటే.. వీటికి వెలుగు వాతావరణం నచ్చదు. చీకటిగా ఉంటేనే ఇష్టపడతాయి. అందుకే రాత్రిళ్ల పూటనే ఇవి తిరుగుతుంటాయి. లోరి్‌సకి రెండు నాలుకలు ఉంటాయి. కింది నాలుకతో దంతాలను శుభ్రపరుస్తుంది. పొడవైన నాలుకతో పూలలోని మకరందాన్ని తాగుతుంది. ముఖ్యంగా పురుగులు, దుంపలు, పండ్లు, బాంబూషూట్స్‌ తిని బతుకుతాయి.

  • చిన్నతోక ఉంటుంది. కానీ ఇది కనిపించదు. ఇక ఈ జంతువు చెట్లమీద ఎక్కువగా కనిపిస్తుంది. పురుగులను తినటానికి వెళ్లేప్పుడు చెట్లమీద కదిలే దృశ్యం ముచ్చటగా ఉంటుంది. తెలివైనవి కూడా. చూడటానికి క్యూట్‌గా అనిపించే ఈ లోరిస్‌ ప్రమాదకారి కూడా. పాములాగా కరుస్తుంది. అయితే విషం కాదు.

  • వాస్తవానికి వీడియోల్లో కనిపించినట్లు ఇది పెట్‌ కాదు. చెట్లల్లోనే ఉండటానికి ఇష్టపడుతుంది.

  • నీళ్లలో ప్రతిబింబాలు కనిపించినా, నీడ కనిపించినా చేతి వేళ్లతో కళ్లను మూసుకుంటాయి.

  • వీటిని మనుషులే చంపేస్తారు. రకరకాల మెడిసిన్స్‌లో ఉపయోగపడటంతో పాటు వీటిని చంపటం వల్ల కొత్త శక్తులు వస్తాయనే అపోహ కొన్ని అడవి జాతుల్లో ఉంది.

  • నిద్రపోయే స్పాట్స్‌ కొత్తవి వెతుక్కుంటాయి. 2 స్క్వేర్‌ మైళ్లలో కనీసం 60 స్పాట్లు నిద్రపోవటానికి వీలుగా మలచుకుంటాయి.

Updated Date - 2023-01-27T06:45:58+05:30 IST