Fashion Jeans : జీను ప్యాంటులోన బుల్లెమ్మో...

ABN , First Publish Date - 2023-01-24T23:11:35+05:30 IST

జీన్స్‌ ప్యాంటులో ఉండే సౌకర్యం అంతా ఇంతా కాదు. ఎంచుకోడానికి వీలున్నన్ని మోడల్స్‌ జీన్స్‌లో ఉంటాయి.

Fashion Jeans : జీను ప్యాంటులోన బుల్లెమ్మో...

జీన్స్‌ ప్యాంటులో ఉండే సౌకర్యం అంతా ఇంతా కాదు. ఎంచుకోడానికి వీలున్నన్ని మోడల్స్‌ జీన్స్‌లో ఉంటాయి. అయితే ట్రెండ్‌కు తగ్గట్టు జీన్స్‌ను ఎంచుకోవడం మీద దృష్టి పెట్టాలి.

రిప్ప్‌డ్‌ జీన్స్‌: మోడర్స్‌ లుక్‌ సొంతం కావాలంటే ఈ జీన్స్‌ ఎంచుకోవాలి. చిరుగుల సైజు, ప్రదేశాలు కీలకం. కాబట్టి సౌకర్యానికే పెద్ద పీట వేస్తూ నప్పే జీన్స్‌ ఎంచుకోవాలి. జీన్స్‌ షర్ట్‌, టీ షర్ట్‌, క్రాప్‌ టాప్స్‌తో ఈ రకం జీన్స్‌ను మ్యాచ్‌ చేయవచ్చు.

బూట్‌ కట్‌ జీన్స్‌: అందమైన శరీరాకృతి కలిగి ఉండే అమ్మాయిలకు నప్పే జీన్స్‌ ఇవి. అయితే కురచగా కనిపించే అమ్మాయిలు వీటిని ఎంచుకోకపోవడమే మేలు. ఈ బూట్‌కట్‌ జీన్స్‌కు స్కిన్‌ ఫిట్టింగ్‌ టాప్స్‌ బాగుంటాయి. ఈ జీన్స్‌కు మ్యాచింగ్‌గా పెన్సిల్‌ హీల్స్‌ ధరించాలి.

టాంపర్డ్‌ జీన్స్‌: వెలసిపోయినట్టుండే జీన్స్‌ డైలీ వేర్‌గా బాగుంటాయి. వీటి మీదకు కార్డిగాన్స్‌ లేదా లాంగ్‌ టీషర్ట్‌లను ధరించాలి. బూట్స్‌, స్పోర్ట్స్‌ షూస్‌, చేతికి పెద్ద డయల్‌ వాచ్‌ అందంగా ఉంటాయి.

స్ట్రెయిట్‌ జీన్స్‌: సాదాసీదాగా కనిపించాలనుకుంటే ఈ రకం జీన్స్‌ ఎంచుకోవాలి. కాటన్‌ టాప్స్‌ మొదలు ఎలాంటి టాప్స్‌తోనైనా ఈ రకం జీన్స్‌ను మ్యాచ్‌ చేయవచ్చు. కాస్త ట్రెండీగా కనిపించాలనుకుంటే కలర్‌ఫుల్‌ స్టోల్‌ ధరించాలి.

బాయ్‌ ఫ్రెండ్‌

జీన్స్‌: బిగుతుగా ఉండే జీన్స్‌ను ఇష్టపడని వాళ్ల కోసమే ఈ బాయ్‌ఫ్రెండ్‌ జీన్స్‌. వీటిని బూట్స్‌, హీల్స్‌తో మ్యాచ్‌ చేయవచ్చు.

Updated Date - 2023-01-24T23:11:36+05:30 IST