బడ్జెట్‌లో ఎవరికేంటి?

ABN , First Publish Date - 2023-02-02T03:24:04+05:30 IST

ఆదాయపన్ను కొత్త స్లాబ్‌లు, కొత్త పన్ను విధానంలో భారీ రిబేట్‌ కలిసివచ్చే అంశం. అగ్నిపథ్‌ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో చేరే అగ్నివీరులకు పన్ను ఉపశమనాలుంటాయి.

బడ్జెట్‌లో ఎవరికేంటి?

యువతకు

ఆదాయపన్ను కొత్త స్లాబ్‌లు, కొత్త పన్ను విధానంలో భారీ రిబేట్‌ కలిసివచ్చే అంశం. అగ్నిపథ్‌ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో చేరే అగ్నివీరులకు పన్ను ఉపశమనాలుంటాయి. యువత కోసం స్కిల్‌ ఇండియా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించారు. దీన్ని ఉపాధి కల్పించే వారు, ఎంఎ్‌సఎంఈలు, ఔత్సామిక పారిశ్రామికవేత్తలతో అనుసంధానం చేస్తారు. స్కిల్‌ ఇండియా శిక్షణ పొందేవారికి ఉపకార వేతనాలు ఇస్తారు. రానున్న మూడేళ్లలో నేషనల్‌ అప్రెంటి్‌సషిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ ద్వారా 47 లక్షల మంది వీటి ద్వారా నైపుణ్యతను అభివృద్ధి చేసుకుంటారని అంచనా. ఈ-వాహనాల ధరలు తగ్గడం మధ్యతరగతి యువతకు ఉపయుక్తంగా ఉంటుంది.

విద్యార్థులకు

అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు, ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో 5జీ అప్లికేషన్ల తయారీకి 100 ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు. స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలిచ్చేందుకు ‘డేటా గవర్నెన్స్‌ పాలసీ’ని తీసుకురానున్నారు.

ఉద్యోగులకు

ప్రైవేటు ఉద్యోగుల పదవీ విరమణానంతర ఆర్జిత సెలవుల నగదీకరణకు పన్ను మినహాయింపు పరిమితి రూ.25 లక్షలకు పెంపు. పన్ను స్లాబ్‌ల మార్పు. పీఎం ఆవాస్‌ యోజన(పీఎంఏవై) సొంతిటికి లోన్‌ తీసుకున్న వారిలో ఎక్కువ మందికి కేంద్రం నుంచి సబ్సిడీ

వ్యవసాయదారులకు

పాడి, పశుసంవర్థకం, చేపల పెంపకానికి, వ్యవసాయ రుణ లక్ష్యం పెంపు. రైతుల సమస్యలు, సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కొనేలా.. గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారా అగ్రి స్టార్ట్‌పలకు ప్రోత్సాహం. వ్యవసాయ పద్ధతులను మార్చడానికి, ఉత్పాదకతను, లాభదాయకతను పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేస్తారు.

వృద్ధులకు

సేవింగ్స్‌ గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేయడంతోపాటు.. వడ్డీ రూపంలో నెలనెలా ఆదాయం వచ్చే సేవింగ్స్‌ గరిష్ఠ పరిమితిని కూడా రెట్టింపు చేశారు.

మహిళలకు : మహిళల కోసం ప్రత్యేకంగా ‘సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’ను ప్రకటించారు. ఈ విధానంలో 7.5% స్థిరవడ్డీతో రూ.2 లక్షల వరకు సేవింగ్స్‌ చేసుకోవచ్చు

హస్తకళాకారులకు: ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పథకం కింద సొంతంగా జియోగ్రాఫికల్‌ ఐడెంటిటీ(జీఐ), హస్తకళల ఉత్పత్తుల ప్రచారం, ప్రదర్శన-విక్రయాలకు రాష్ట్రాల రాజధానుల్లో ‘యూనిటీ మాల్స్‌’ ఏర్పాటుకు ఆయా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు.

Updated Date - 2023-02-02T03:24:05+05:30 IST