అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ

ABN , First Publish Date - 2023-01-25T01:06:39+05:30 IST

షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించడం, చైనా లూనార్‌ కొత్త సంత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలైన ఘటనలను మరువక ముందే.. అమెరికాలో

అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ

వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది మృతి’

వాషింగ్టన్‌, జనవరి 24: షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించడం, చైనా లూనార్‌ కొత్త సంత్సరం వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది దుర్మరణం పాలైన ఘటనలను మరువక ముందే.. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. కాలిఫోర్నియాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఝోచున్లీ(చైనా జాతీయుడు) అనే వ్యవసాయ కార్మికుడు సోమవారం తోటి కార్మికులపై కాల్పులకు తెగబడ్డాడు. అక్కడి నుంచి పారిపోతూ.. కొద్దిదూరంలో మరోమారు కాల్పులు జరిపాడు. ఈ ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. మరో ఘటనలో.. ఐయోవా నగరంలోని డెస్‌ మెయినెస్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.

Updated Date - 2023-01-25T01:06:39+05:30 IST