Special train: అహ్మదాబాద్‌ - తిరుచ్చి ఎక్స్‌ప్రెస్‌ కొనసాగింపు

ABN , First Publish Date - 2023-02-02T09:05:54+05:30 IST

అహ్మదాబాద్‌ - తిరుచ్చి(Ahmedabad - Trichy) మధ్య ప్రత్యేక రైలు కొనసాగించనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. 09419 నెంబరు గల

Special train: అహ్మదాబాద్‌ - తిరుచ్చి ఎక్స్‌ప్రెస్‌ కొనసాగింపు

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్‌ - తిరుచ్చి(Ahmedabad - Trichy) మధ్య ప్రత్యేక రైలు కొనసాగించనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. 09419 నెంబరు గల ఈ రైలు ఈ నెల 3, 9, 16, 23, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో ఉదయం 9.30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి మూడో రోజు ఉదయం 3.45 గంటలకు తిరుచ్చి చేరుకుంటుంది. అదే విధంగా 09420 నెంబరు గల రైలు ఈ నెల 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26 తేదీల్లో ఉదయం 5.45 గంటలకు తిరుచ్చిలో బయలుదేరి మరునాడు రాత్రి 9.15 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లకు గురువారం ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్‌ ప్రారంభమవుతుందని దక్షిణరైల్వే ప్రకటించింది.

Updated Date - 2023-02-02T09:05:55+05:30 IST