సోనియా, స్టాలిన్‌ కోరిక మేరకే పోటీచేస్తున్నా..

ABN , First Publish Date - 2023-02-02T08:14:46+05:30 IST

ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో డీఎంకే సెక్యులర్‌ కూటమి తరఫు అభ్యర్థిగా పోటీచేస్తున్నానని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(EVKS I

సోనియా, స్టాలిన్‌ కోరిక మేరకే పోటీచేస్తున్నా..

- ఈవీకేఎస్‌ ఇళంగవోన్‌

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో డీఎంకే సెక్యులర్‌ కూటమి తరఫు అభ్యర్థిగా పోటీచేస్తున్నానని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(EVKS Ilangaon) తెలిపారు. నియోజకవర్గంలో ఆయన డీఎంకే మిత్రపక్షాల నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓట్ల వేట సాగించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఏడాదిన్నరపాటు ప్రజలకు సేవలందించిన తన కుమారుడు తిరుమగన్‌ మృతితో క్రుంగిపోయానని, ఆ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనను పరామర్శించడమే కాకుండా పుత్ర శోకం నుంచి బయటపడేలా చేశారని చెప్పారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరిక మేరకే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు.

Updated Date - 2023-02-02T08:14:48+05:30 IST