యూవీ గోళ్ల డ్రైయర్లతో చర్మ కేన్సర్!
ABN , First Publish Date - 2023-01-25T00:58:23+05:30 IST
సెలూన్లలో వాడే జెల్ మేనిక్యూర్లలోని అతినీలలోహిత(యూవీ) గోళ్ల పాలి ష్ డ్రైయర్ల వలన చర్మ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

లాస్ఏంజిలిస్, జనవరి 24: సెలూన్లలో వాడే జెల్ మేనిక్యూర్లలోని అతినీలలోహిత(యూవీ) గోళ్ల పాలి ష్ డ్రైయర్ల వలన చర్మ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ పరికరాల నుంచి ఉత్పత్తి అయ్యే యూవీ కిరణాలు కణాల మృతికి దారితీస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ‘‘ఈ అతినీలలోహిత వెలుగును వెదజల్లే పరికరాలను కేవలం 20నిముషాల పాటు వీటిని వాడితేనే 20 నుంచి 30శాతం కణాలు మృతిచెందాయి. ఇలా వరసగా మూడు విడతల్లో ఇరవయ్యేసి నిముషాల పాటు యూవీ వెలుగుకు గురైన కణాల్లో 70శాతం మృతిచెందాయి. యూవీ వెలుగుతో కణాల డీఎన్ఏ కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ఇటువంటి పరికరాలను దీర్ఘకాలం వాడటం వలన కచ్చితంగా చర్మ కేన్సర్లు వస్తాయి’’ అని తేల్చిచెప్పారు.