హిందుత్వంలో.. హత్యలు, హింస

ABN , First Publish Date - 2023-02-07T03:10:16+05:30 IST

మనువాదం, హిదుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందుత్వంలో.. హత్యలు, హింస

మేం హిందువులకు కాదు.. హిందుత్వానికే వ్యతిరేకం

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మనువాదం, హిదుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందువులకు హిందూత్వతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని పేర్కొన్నారు. ‘‘హిందుత్వం వేరు హిందు ధర్మం వేరు. నేను కూడా హిందువునే. కానీ, మనువాదానికి, హిందుత్వానికి వ్యతిరేకిని. ఏ మతమైనా హత్యలను, హింసను ప్రోత్సహిస్తుందా..? కానీ, మనువాదం, హిందుత్వం మాత్రం హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రోత్సహిస్తాయి. హిందూ ధర్మానికి, హిందుత్వానికి ఉన్న తేడా అదే’ అని సిద్దరామయ్య అన్నారు.

Updated Date - 2023-02-07T03:10:17+05:30 IST