ముస్లిం మేధావులతో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం

ABN , First Publish Date - 2023-01-25T00:57:27+05:30 IST

ఆర్‌ఎ్‌సఎస్‌ సీనియర్‌ నాయకులు పలువురు ముస్లిం మేధావులతో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఇంట మంగళవారం సమావేశమయ్యారు. ద్వేష పూరిత ప్రసంగాలు, మూక దాడులు, బుల్‌డోజర్‌

ముస్లిం మేధావులతో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం

కాశి, మధుర ఆలయాలపై చర్చ

న్యూఢిల్లీ, జనవరి 24: ఆర్‌ఎ్‌సఎస్‌ సీనియర్‌ నాయకులు పలువురు ముస్లిం మేధావులతో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ఇంట మంగళవారం సమావేశమయ్యారు. ద్వేష పూరిత ప్రసంగాలు, మూక దాడులు, బుల్‌డోజర్‌ రాజకీయాలు, కాశి, మధుర ఆలయాలపై చర్చించుకున్నారు. ముస్లిం సమాజానికి చేరువ అవ్వాలన్న నిర్ణయం మేరకు గతేడాది ఆగస్టు 22న ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ముస్లిం ప్రముఖులతో సమావేశమయ్యారు. అనంతరం ఈ నెల 14న ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు, ముస్లిం ప్రతినిధుల మధ్య మరో సమావేశం జరిగింది. తాజాగా మంగళవారం జరిగిన సమావేశంలో ద్వేష పూరిత ప్రసంగాల కారణంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకుల దృష్టికి ముస్లిం మేధావులు తెచ్చారు. బాబ్రి మసీదు ఉదంతం నేపథ్యంలో కాశి, మధుర మసీదులను వదులుకోవడం ద్వారా సత్సంబంధాలు ఏర్పడతాయని ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు వారికి సూచించారు.

Updated Date - 2023-01-25T00:57:28+05:30 IST