రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల్లో రికార్డు

ABN , First Publish Date - 2023-02-07T03:16:26+05:30 IST

రష్యా నుంచి భారత్‌ ముడిచమురు దిగుమతుల వాటా ఈ ఏడాది జనవరిలో రికార్డుస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించక ముందు భారత్‌ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతమే ఉండేది.

రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల్లో రికార్డు

జనవరిలో దేశ అవసరాల్లో 28% అక్కణ్నుంచే

వరుసగా 4 నెలలుగా పెరుగుతున్న దిగుమతులు

బెంగళూరు, ఫిబ్రవరి 6: రష్యా నుంచి భారత్‌ ముడిచమురు దిగుమతుల వాటా ఈ ఏడాది జనవరిలో రికార్డుస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించక ముందు భారత్‌ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతమే ఉండేది. దేశ అవసరాల్లో అత్యధికంగా మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ, వరుసగా 4 నెలలుగా రష్యా నుంచి చమురు దిగుమతుల వాటా భారీ గా పెరుగుతోంది. జనవరిలో ఏకంగా 1.27 మిలియన్‌ బ్యారెళ్ల చమురు (ఎనర్జీ కార్గో ట్రాకర్‌ వోర్టెక్సా గణాంకాల ప్రకారం మన చమురు అవసరాల్లో 28ు) రష్యా నుంచే భారత్‌ దిగుమతి చేసుకుంది. ఇదిలాగే కొనసాగుతుందని, దేశ ఇంధన అవసరాలకోసం రష్యా సహా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంటుందని సోమవారం ఇక్కడ ‘ఇండియా ఎనర్జీ వీక్‌’లో అధికారులు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలులేవని ఒక అధికారి గుర్తుచేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఈయూ గత డిసెంబరులో బ్యారెల్‌కు 60డాలర్ల పరిమితిని విధించింది. భారత్‌ అంతకన్నా తక్కువ ధరకే రష్యా చమురు కొంటున్నట్టు సమాచారం.

Updated Date - 2023-02-07T03:16:27+05:30 IST