Punjab: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మనీషా గులాటీ తొలగింపు

ABN , First Publish Date - 2023-02-02T07:48:50+05:30 IST

పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మనీషా గులాటీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు...

Punjab: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మనీషా గులాటీ తొలగింపు
Punjab Women Commission chief Manisha Gulati

చండీఘడ్ : పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మనీషా గులాటీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.(Punjab) 2020 సెప్టెంబరు నెలలో మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీ చేసిన లేఖను పంజాబ్ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్(Punjab Women Commission) మనీషా గులాటీ (Manisha Gulati) పదవీకాలం పొడిగింపు లేఖ జారీ చేయడం తప్పని పంజాబ్ రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ కిర్పా శంకర్ సరోజ్ చెప్పారు.

పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 2001 ప్రకారం సిట్టింగ్ చైర్‌పర్సన్ లేదా కమిషన్ సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్లకు మించి పొడిగించే నిబంధన లేదని సరోజ్ తెలిపారు.బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనీషా గులాటీ 2018వ సంవత్సరం మార్చిలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

Updated Date - 2023-02-02T07:48:52+05:30 IST