కొత్త కొత్తగా...

ABN , First Publish Date - 2023-02-02T03:17:52+05:30 IST

ఎంఎస్‌ఎంఈలు, భారీ పరిశ్రమలు, ధార్మిక సంస్థలు తమ పత్రాలు భద్రంగా దాచుకోవడానికి వీలుగా ‘ఎంటిటీ డీజీలాకర్‌’.

కొత్త కొత్తగా...

  • ఎంఎస్‌ఎంఈలు, భారీ పరిశ్రమలు, ధార్మిక సంస్థలు తమ పత్రాలు భద్రంగా దాచుకోవడానికి వీలుగా ‘ఎంటిటీ డీజీలాకర్‌’.

  • కొత్త అవకాశాలు, వ్యాపార ఆలోచనలు, ఉపాధి కల్పన కోసం 5జీ సేవల ఆధారంగా రూపొందించే యాప్‌ల సృష్టికి 100 సరికొత్త ప్రయోగ కేంద్రాలు.

  • ‘గోబర్ధన్‌’ కింద వ్యర్థాల నుంచి సంపద సృష్టించేలా 500 కొత్త ప్లాంట్లు.

  • వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు చేపట్టేలా ప్రోత్సాహం. దీనికోసం పదివేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్స్‌ ఏర్పాటు.

  • ‘ఇండస్ట్రీ 4.0’కు సిద్ధంగా కృత్రిమ మేఽధ, రోబోటిక్స్‌, మెకట్రానిక్స్‌, ఐవోటీ, త్రీడీ ప్రింటింగ్‌, డ్రోన్స్‌ తదితర సాంకేతికత నైపుణ్యాలపై లక్షలాది మందికి శిక్షణ... దీనికి ‘ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0’గా నామకరణం.

  • మన యువత అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేలా 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్స్‌ ఏర్పాటు.

  • గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధారిత స్టార్టప్స్‌ ఏర్పాటుకు ‘అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌’.

  • 63వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకు రూ.2516 కోట్లు.

  • ఔషధ రంగంలో పరిశోధనల ప్రోత్సాహానికి కొత్త పథకం.

  • రేవులు, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా, కనెక్టివిటీ కోసం రూ.75వేల కోట్ల పెట్టుబడి.

  • మౌలిక సదుపాయాల్లో ప్రైవేటుకు అవకాశాలు పెంచేలా... ‘న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ సెక్రటేరియట్‌’ ఏర్పాటు.

  • పిల్లలు, చిన్నారుల కోసం ‘డిజిటల్‌ లైబ్రరీ’లు.

  • సుమారు లక్ష తాళపత్ర గ్రంఽథాల డిజిటలీకరణకోసం ‘భారత్‌ షేర్డ్‌ రిపాసిటరీ ఆఫ్‌ ఇన్‌స్ర్కిప్షన్స్‌’ పథకం.

  • ‘ఐగాట్‌ కామయోగి’ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ.

  • ‘మేక్‌ ఐఏ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఇన్‌ ఇండియా అండ్‌ మేక్‌ ఏఐ వర్క్‌ ఫర్‌ ఇండియా’ కింద మూడు ఉన్నత స్థాయి కేంద్రాలు.

  • ప్రయోగ శాలల్లో వజ్రాల తయారీ కోసం ప్రత్యేక నిధి.

  • చిత్తడి నేలల వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ పర్యాటకం పెంపు కోసం ‘అమృత్‌ ధారోహర్‌’ పథకం. మూడేళ్లపాటు అమలు.

  • దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా 50 పర్యాటక కేంద్రాల అభివృద్ధి. ‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో పర్యాటకానికి ప్రోత్సాహం.

Updated Date - 2023-02-02T03:18:11+05:30 IST