Movie actor Srikanth: పాఠశాలను పరిశీలించిన సినీ నటుడు శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2023-02-02T11:10:09+05:30 IST

తెలుగు చిత్రరంగంలో పేరు గాంచిన హీరో శ్రీకాంత్‌(Hero Srikanth) బుధవారం కంప్లి పట్టణంలోని విజయనగర పాఠశాలను పరిశీలించారు. కమ్మసంఘం

Movie actor Srikanth: పాఠశాలను పరిశీలించిన సినీ నటుడు శ్రీకాంత్‌

కంప్లి(బెంగళూరు), ఫిబ్రవరి 1 : తెలుగు చిత్రరంగంలో పేరు గాంచిన హీరో శ్రీకాంత్‌(Hero Srikanth) బుధవారం కంప్లి పట్టణంలోని విజయనగర పాఠశాలను పరిశీలించారు. కమ్మసంఘం ఆధ్వర్యంలో ఆయనను పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితుల ఆహ్వానం మేరకు వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఇంటా పిల్లలకు విద్యాభ్యాసం కల్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏదైనా మనం చేసే పని క్రమశిక్షణతో చేస్తే జీవితంలో గుర్తింపు వుంటుందన్నారు. తనకు నచ్చిన ఏ పాత్ర అయినా వేస్తానని తెలిపారు. ఆయనతో పాటు కమ్మ సంఘం అధ్యక్షుడు సుబ్బారావు, నాయకులు కొండయ్య, రామబసవేశ్వరరావు, అల్లు అశ్వత్థనాయుడు, కోనేరు రామకృష్ణ, భాస్కర్‌, శ్రీనివాసరావు, ప్రసాద్‌, చంద్రశేఖర్‌, పురుషోత్తమ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండింః: PAN : ఇక పాన్‌లోనే మీ జాతకం!

Updated Date - 2023-02-02T11:10:11+05:30 IST