PM Modi : మోదీ.. నంబర్‌ 1

ABN , First Publish Date - 2023-02-04T05:08:57+05:30 IST

అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితాలో మోదీ నంబర్‌ 1గా నిలిచారు. ప్రముఖ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’

PM Modi : మోదీ.. నంబర్‌ 1

మన ప్రధానికి అత్యధిక జనామోదం

78 శాతంతో ప్రపంచంలోనే అగ్రస్థానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితాలో మోదీ నంబర్‌ 1గా నిలిచారు. ప్రముఖ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ జనవరి 26 నుంచి 31 మధ్య అధ్యయనం నిర్వహించి జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో 78 శాతం ప్రజామోదంతో మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 68ు ఆమోదంతో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఓబ్రడార్‌ రెండో స్థానంలో, 58 శాతం జనామోదంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక 40 శాతం జనామోదంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడోలు ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. బ్రిటన్‌ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ 30 శాతం ప్రజామోదంతో పదో స్థానంలో నిలవడం గమనార్హం.

Updated Date - 2023-02-04T05:09:02+05:30 IST