MK Alagiri: డీఎంకేలోకి మళ్లీ అళగిరి?

ABN , First Publish Date - 2023-01-25T07:31:06+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీమంత్రి ఎంకే అళగిరి(MK Alagiri) త్వరలో డీఎంకేలో చేరడానికి రంగం

MK Alagiri: డీఎంకేలోకి మళ్లీ అళగిరి?

- పార్టీపై విశ్వాసం శాశ్వతమంటూ ట్వీట్‌

ప్యారీస్‌(చెన్నై), జనవరి 24: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీమంత్రి ఎంకే అళగిరి(MK Alagiri) త్వరలో డీఎంకేలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇటీవల డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి మదురై వెళ్లి తన పెదనాన్న అళగిరిని కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉదయనిధికి అళగిరి కుటుంబం మొత్తం సాదర స్వాగతం పలికింది. అనంతరం ఉదయనిధి తన పెదనాన్నతో 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించారు. అనంతరం అళగిరిని కలిసిన విలేఖరులు.. మళ్లీ పార్టీలో చేరే అవకాశముందా అని అడగ్గా.. ‘ఆ విషయాన్ని పార్టీ పెద్దలను అడగండి’ అంటూ అళగిరి సమాధానం దాటవేశారు. ఈ నేపథ్యంలో ‘డీఎంకేపై విశ్వాసం శాశ్వతం’ అంటూ మంగళవారం అళగిరి ట్వీట్‌ చేయడం డీఎంకేలో చర్చనీయాంశమైంది. అళగిరి మళ్లీ డీఎంకేలో చేరే అవకాశముందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-01-25T07:31:08+05:30 IST