Kamal Haasan: ఇళంగోవన్‌కే మా మద్దతు
ABN , First Publish Date - 2023-01-26T07:58:33+05:30 IST
ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికఓ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు

- ఎంఎన్ఎం అధినేత కమల్
చెన్నై, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికఓ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Haasan) ప్రకటించారు. ఈ మేరకు ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈరోడ్ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో డీఎంకే కూటమి తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతివ్వాలనే నిర్ణయాన్ని కమల్‌హాసన్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇళంగోవన్‌కు ఎంఎన్ఎంనేత కమల్‌హాసన్ మద్దతు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు.