Share News

Jairam Ramesh: అవన్నీ తప్పుడు వార్తలు.. 4 ట్రిలియన్ వాదనలపై జైరాం రమేశ్ మండిపాటు

ABN , First Publish Date - 2023-11-20T19:48:45+05:30 IST

ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీకి చెందిన కొందరు మంత్రులు భారత జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Jairam Ramesh: అవన్నీ తప్పుడు వార్తలు.. 4 ట్రిలియన్ వాదనలపై జైరాం రమేశ్ మండిపాటు

ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీకి చెందిన కొందరు మంత్రులు భారత జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంతేకాదు.. జీడీపీ లెక్కలకు సంబంధించిన ఫోటోని సైతం ఎటాచ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తాజాగా మండిపడింది. ఇదంతా తప్పుడు ప్రచారం అని.. కేవలం హెడ్‌లైన్స్‌లోకి రావాలన్న ఉద్దేశంతో ఈ ఫేక్ ప్రచారానికి బీజేపీ వాళ్లు తెరలేపారంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 2.45 నుంచి సాయంత్రం 6.45 గంటల మధ్య దేశమంతా క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తుంటే.. రాజస్థాన్ & తెలంగాణకు చెందిన సీనియర్ కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన వ్యాపారవేత్తతో సహా మోడీ ప్రభుత్వంలోని చాలామంది పెద్ద నాయకులు భారతదేశ జీడీపీ సంఖ్య మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ని దాటిందని ట్వీట్ చేశారన్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఈ వార్త పచ్చి అబద్ధమని తేల్చి చెప్పారు. కేవలం పైత్యం చూపించేందుకే ఈ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతో పాటు గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా 4 ట్రిలియన్ మార్క్‌పై పోస్ట్ పెట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించిందని, ఇది మోడీ ప్రభుత్వ నాయకత్వాన్ని తెలియజేస్తుందని, కొత్త భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. మోదీ హామీగా పేర్కొంటూ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్నామన్నారు. ఇక అదానీ అభినందనలు తెలుపుతూ.. కేవలం రెండేళ్లలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. ఇందుకు కౌంటర్‌గానే జైరాం రమేశ్ పైవిధంగా స్పందించారు.

Updated Date - 2023-11-20T19:48:46+05:30 IST