Isro : మరో వాణిజ్య ప్రయోగానికి ఇస్రో రెడీ

ABN , First Publish Date - 2023-03-19T01:15:05+05:30 IST

ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. వన్‌వెబ్‌ సంస్థకు చెందిన 36ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Isro : మరో వాణిజ్య ప్రయోగానికి ఇస్రో రెడీ

సూళ్లూరుపేట, మార్చి 18: ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. వన్‌వెబ్‌ సంస్థకు చెందిన 36ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా షార్‌ నుంచి 26న మార్క్‌3-ఎం3 (ఎల్‌వీఎం3-ఎం3) రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా 5,805 కిలోల బరువున్న 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్‌ ఇడియా-2 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. వన్‌వెబ్‌ ఇండియా సిరీ్‌సలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఇస్రోకు ఈ ఏడాది తొలి వాణిజ్య ప్రయోగం కూడా. గతేడాది అక్టోబరులో కూడా వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి కక్ష్యలోకి పంపి రికార్డు సృష్టించింది.

Updated Date - 2023-03-19T01:15:05+05:30 IST