భద్రతకు భరోసానిచ్చే స్వదేశీ ఓఎస్‌

ABN , First Publish Date - 2023-01-25T01:10:29+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల భద్రత, గోప్యతకు భరోసా కల్పించేలా ఐఐటీ మద్రాస్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ‘భరోస్‌’ (ఆజ్చిటౖఖి)ను కేంద్ర ప్రభుత్వం పరీక్షించింది.

భద్రతకు భరోసానిచ్చే స్వదేశీ ఓఎస్‌

స్మార్ట్‌ఫోన్‌ ఓఎస్‌ ‘భరోస్‌’ను పరీక్షించిన కేంద్రం

ఆండ్రాయిడ్‌, ఐఓఎ్‌సకు పోటీగా ఐఐటీ మద్రాస్‌ సృష్టి

న్యూఢిల్లీ, జనవరి 24: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల భద్రత, గోప్యతకు భరోసా కల్పించేలా ఐఐటీ మద్రాస్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ‘భరోస్‌’ (ఆజ్చిటౖఖి)ను కేంద్ర ప్రభుత్వం పరీక్షించింది. కేంద్ర సమాచార, ఐటీ మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, టెలికాం మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మంగళవారం దీన్ని పరీక్షించారు. ఐఐటీ మద్రా్‌సలోని జండ్‌కే ఆపరేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్టార్టప్‌ ఈ భరో్స్‌ను అభివృద్ధి చేసింది.

భరోసను పరీక్షించిన సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని మోదీ డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడినప్పుడు.. కొందరు ఎగతాళి చేశారు. కానీ, నేడు అందరూ ఆయన విజన్‌ను అంగీకరిస్తున్నారు. స్వదేశీ ఆపరేగింగ్‌ సిస్టమ్‌ ‘భరోస్‌’ అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు’ అని అన్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ ఆండ్రాయిడ్‌, ఆఫిల్‌ ఫోన్‌ వినియోగదారులకు ఐఓఎస్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌ దేశీయంగా రూపొందించిన భరోస్‌.. మొబైల్‌ వినియోగదారుల సమాచారం గోప్యంగా, భద్రంగా ఉండేలా, స్మార్ట్‌ఫోన్‌ను సౌకర్యంగా వినియోగించుకునేలా భరోసా కల్పించనుంది. స్మార్ట్‌ఫోన్లలో విదేశీ ఓస్‌లపై ఆధారపడడాన్ని తగ్గించడం, స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ పాజ్రెక్ట్‌ లక్ష్యం.

భరోస్‌ ఫీచర్లివే..

ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ ఓఎ్‌సల్లో కొన్ని యాప్‌లు డీఫాల్ట్‌గా వస్తాయి. వినియోగదారుడికి వాటి అవసరం లేకున్నా అవి అలాగే ఉండిపోతాయి. దీనివల్ల స్పేస్‌ వృథా అవుతుంది. అయితే.. భరో్‌సలో డీఫాల్ట్‌ యాప్‌లు ఏమీ ఉండవు.

భరో్‌సకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ నేటివ్‌ ఓవర్‌ ద ఎయిర్‌ (ఎన్‌ఓటీఏ) ద్వారానే వస్తాయి. దీనివల్ల వినియోగదారుడి ప్రమేయం లేకుండా ఓఎస్‌ అప్‌డేట్లు వాటంతట అవే ఇన్‌స్టాల్‌ అవుతాయి. దీనివల్ల ఫోన్‌ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా, సురక్షితంగా ఉంటుంది.

భరో్‌సను ప్రస్తుతం గోప్యత, భద్రత పరంగా సున్నితమైన సమాచారం వినియోగించే సంస్థలకు అందిస్తున్నారు. ఒకవేళ ఏదైనా సంస్థ దీన్ని కావాలనుకుంటే ఆయా సంస్థలు ప్రైవేటు 5జీ నెట్‌వర్క్‌ ద్వారా ప్రైవేటు క్లౌడ్‌ సేవలను ఉపయోగిస్తుండాలని జండ్‌కే సంస్థ తెలిపింది.

భరోస్‌ వినియోగదారులకు ప్రైవేట్‌ యాప్‌ స్టోర్‌ సర్వీస్‌ (పాస్‌) అందుబాటులో ఉంటుంది. దీనిలో గోప్యతకు భంగం కలిగించని, సురక్షితమైన యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నిపుణులు వివిధ దశల్లో పరిశీలించాకే వాటిని పాస్‌లోకి అనుమతిస్తారు.

Updated Date - 2023-01-25T01:11:33+05:30 IST