భారీగా పుంజుకున్న కాంగ్రెస్‌ కూటమి

ABN , First Publish Date - 2023-01-27T02:46:21+05:30 IST

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 284 సీట్లు వస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే 69 సీట్లు తగ్గినట్లే. అదే సమయంలో, కాంగ్రెస్‌ నేతృత్వంలోని

భారీగా పుంజుకున్న కాంగ్రెస్‌ కూటమి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 191 సీట్లు

మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు 284 మాత్రమే

ఇండియా టుడే-సీవోటర్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ సర్వే

న్యూఢిల్లీ, జనవరి 26: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 284 సీట్లు వస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే 69 సీట్లు తగ్గినట్లే. అదే సమయంలో, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 191 సీట్లు వస్తాయి. అంటే, గత ఎన్నికలతో పోలిస్తే 100 సీట్లు పెరుగుతాయి. ఇదే నిజమైతే కాంగ్రెస్‌ పార్టీ భారీగా పుంజుకున్నట్లే. ఇది ఇండియా టుడే-సీవోటర్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ తాజా సర్వే అంచనా. ప్రధాని మోదీకి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో రాహుల్‌ చేపట్టిన జోడో యాత్ర కాంగ్రెస్‌కు ఓట్లు రాల్చవని సర్వేలో పాల్గొన్న పౌరులు అభిప్రాయపడినట్లు పేర్కొంది. జోడో యాత్రతో ఓట్లు పడతాయా? అనే ప్రశ్నకు 37ు మంది లేదని చెప్పారు. ఇండియా టుడే తరఫున 1.40 లక్షల మంది, సీవోటర్స్‌ తరఫున 1.15 లక్షల మంది పాల్గొన్న ఈ సర్వే ఫలితాల్లోని ముఖ్యాంశాలు..

ఆర్థిక మాంద్యం భయాలున్నా..

ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలున్నా.. మరోవైపు నుంచి చైనాతో ముప్పు ఉన్నా.. సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది ఎన్డీయే సర్కారుకే జైకొట్టారు. మోదీ సర్కారు పాలన సంతృప్తికరంగా ఉందని చెప్పారు. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేతో పోలిస్తే.. ఇది 11% ఎక్కువ. సర్వేలో పాల్గొన్న వారిలో 72% మంది ప్రధాని మోదీ పనితీరు బాగుందన్నారు. కొవిడ్‌-19 మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం ఎన్డీయే ఘనత అని 20% మంది పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించలేకపోయిందని 25ు, నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయిందని 17% మంది అభిప్రాయపడ్డారు

కొలీజియం వ్యవస్థపై

ఈ సర్వేలో.. 38% మంది కొలిజియం వ్యవస్థను సమర్థించారు. 31% మంది ప్రభుత్వం, జడ్జిలు కలిసి న్యాయమూర్తుల నియామకం చేసే వ్యవ స్థ ఉండాలని, 19% మంది ఆ బాధ్యతను ప్రభుత్వానికే వదిలిపెట్టాలని సూచించారు. ఉమ్మడి పౌరస్మృతికి 69% మంది జైకొట్టారు.

Updated Date - 2023-01-27T09:29:54+05:30 IST