Chief Minister: విద్య, వైద్యానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2023-02-02T10:38:55+05:30 IST

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ విద్య, వైద్య రంగాలకే అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minist

Chief Minister: విద్య, వైద్యానికే ప్రాధాన్యం

- వేలూరు జిల్లాలో రూ.15.96 కోట్లతో తరగతి భవనాలు

- సీఎం స్టాలిన్‌ శంకుస్థాపన

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ విద్య, వైద్య రంగాలకే అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) చెప్పారు. వేలూరు జిల్లాలో రూ.15.96 కోట్లతో ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలల్లో నిర్మించనున్న 114 తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అన్బళగన్‌ పాఠశాలల అభివృద్ధి పథకం కింద గ్రామ, నగర పంచాయతీలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.784 కోట్లతో 5351 తరగతి గదులను నిర్మించనుంది. ఇందులో భాగంగా వేలూరు జిల్లా కాట్పాడి ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఉదయం జరిగిన సభలో కొత్త తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, రోగులకు చికిత్స అందించే వైద్యులకు, వారు పనిచేసే ఆస్పత్రులకు మెరుగైన సాంకేతిక సదుపాయాలను అందించాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వేలూరు, కాట్పాడి, గుడియాత్తం, అనైకట్టు, కనియంబాడి, పేర్నంబట్టు, కేవీ కుప్పం ప్రాంతాల్లో కొత్త తరగతి గదులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, ఐ. పెరియసామి, పొన్ముడి, ఆర్‌ గాంధీ, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, వేలూరు కార్పొరేషన్‌ మేయర్‌ సుజాత ఆనంద్‌కుమార్‌, ఎంపీలు డాక్టర్‌ ఎస్‌.జగద్రక్షగన్‌, కదిర్‌ ఆనంద్‌, శాసనసభ్యులు నందకుమార్‌, కార్తికేయన్‌, అములు విజయన్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌కుమార్‌, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T10:38:57+05:30 IST