యూపీలో ప్రీపెయిడ్‌ మీటర్ల టెండర్‌ రద్దు

ABN , First Publish Date - 2023-02-07T03:15:27+05:30 IST

సుమారు 70లక్షల ప్రీపెయిడ్‌ మీటర్ల కోసం విడుదల చేసిన టెండర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మధ్యాంచల్‌ విద్యుత్‌ వితరణ్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంవీవీఎన్‌ఎల్‌) సంస్థ తాజాగా రద్దు చేసింది.

యూపీలో ప్రీపెయిడ్‌ మీటర్ల టెండర్‌ రద్దు

అత్యల్పంగా బిడ్‌ చేసిన అదానీ గ్రూపు

అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు ఎంవీవీఎన్‌ఎల్‌ ప్రకటన

లఖ్‌నవూ, ఫిబ్రవరి 6: సుమారు 70లక్షల ప్రీపెయిడ్‌ మీటర్ల కోసం విడుదల చేసిన టెండర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మధ్యాంచల్‌ విద్యుత్‌ వితరణ్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంవీవీఎన్‌ఎల్‌) సంస్థ తాజాగా రద్దు చేసింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ టెండర్‌ను రద్దు చేస్తున్నామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. టెండర్‌కు అదానీ సంస్థ అత్యంత తక్కువగా రూ. 5,400 కోట్లకు బిడ్‌ను వేసింది. అయితే.. బిడ్డింగ్‌ సంస్థలు కూడబలుక్కుని, కావాలనే టెండర్‌ ధరను పెంచాయని యూపీ రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారుల మండలి ఆరోపిస్తోంది. అదానీ బిడ్‌ ప్రకారం మీటర్‌కు రూ.10వేల వరకూ ఇవ్వాల్సి ఉంటుందని, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) మార్గదర్శకాల్లో పేర్కొన్నదానికంటే ఇది దాదాపు 65ు ఎక్కువ అని మండలి చైర్మన్‌ అవధేశ్‌ కుమార్‌ తెలిపారు. పైపెచ్చు, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థల్లో ఏవీ ప్రీపెయిడ్‌ మీటర్లను ఉత్పత్తి చేయడం లేదన్నారు.

Updated Date - 2023-02-07T03:15:28+05:30 IST