By-election: ఈరోడ్‌ ఈస్ట్‌ అన్నాడీఎంకే అభ్యర్థి తెన్నరసు

ABN , First Publish Date - 2023-02-02T07:36:53+05:30 IST

ఎట్టకేలకు ఈరోడ్‌ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక(By-election)లో పోటీ చేయనున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఖరారైంది. అందరి అంచనాలను త

By-election: ఈరోడ్‌ ఈస్ట్‌ అన్నాడీఎంకే అభ్యర్థి తెన్నరసు

- ప్రకటించిన ఈపీఎస్‌

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఈరోడ్‌ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక(By-election)లో పోటీ చేయనున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఖరారైంది. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ తెన్నరసుకు మళ్ళీ అవకాశం కల్పించారు. ఈరోడ్‌ ఈస్ట్‌ ఉప ఎన్నిక ఈ నెల 27న జరుగనుంది. ఈ నియోజకవర్గంలో డీఎంకే సెక్యులర్‌ కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నెల మూడున ఆయన నామినేషన్‌ వేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తరఫున మాజీ ఎమ్మెల్యే తెన్నరసు బరిలోకి దిగుతున్నారు. 65 ఏళ్ల కేఎస్‌ తెన్నరసు 1988 నుంచి అన్నాడీఎంకేలో వివిధ పదవులు పొందారు. 1992లో ఈరోడ్‌ నగర డిప్యూటీ కార్యదర్శిగా, 1995లో నగర కార్యదర్శి, 1999న ఈరోడ్‌ ఈస్ట్‌ జిల్లా ఎంజీఆర్‌ మండ్రం కార్యదర్శిగా, 2000లో మళ్ళీ ఈరోడ్‌ నగరశాఖ కార్యదర్శిగా, 2011 నుండి ఈరోడ్‌ ఈస్ట్‌(Erode East) నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2001లో ఈరోడ్‌ నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత ఈరోడ్‌ నియోజకవర్గాన్ని ఈరోడ్‌ ఈస్ట్‌, ఈరోడ్‌ వెస్ట్‌గా విభజించారు. 2016లో ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో తెన్నరసు పోటీ చేసి రెండోమారు గెలిచారు. 2021 ఎన్నికల్లో ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గాన్ని అన్నాడీఎంకే మిత్రపక్షమైన టీఎంసీకి కేటాయించడంతో తెన్నరసు పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. ఈరోడ్‌ కరుంగల్‌పాళయం సొక్కాయ్‌తోట్టమ్‌ ప్రాంతంలో నివసిస్తున్న తెన్నరసుకు భార్య పద్మిని, కుమారుడు కళైఅరసన్‌, కుమార్తె డి. కలైవాణి ఉన్నారు.

ఎన్నికల కార్యాలయం ప్రారంభం...

ఈరోడ్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని మాజీ మంత్రి సెంగోట్టయ్యన్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అఽభ్యర్థి తెన్నరసు, పార్టీ సీనియర్‌ నాయకులు పొన్నయ్యన్‌, కేపీ మునుసామి, ఆర్బీ ఉదయకుమార్‌, సెల్లూరు కె.రాజు, వేలుమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T07:36:55+05:30 IST