Dubai : కొనేద్దాం.. ఓ ఇల్లు దుబాయ్‌లో!!

ABN , First Publish Date - 2023-02-06T01:06:40+05:30 IST

అక్కడా.. ఇక్కడా కాదు భాయ్‌.. కొంటే గింటే బుర్జ్‌ ఖలీఫా దగ్గర దుబాయ్‌లోనే ఇల్లు కొనేద్దాం అంటున్నారు సంపన్న భారతీయులు. ధరకు వెరవకుండా.. ఖరీదైన నగరంలో ఓ ఇల్లు కొనిపడేస్తున్నారు. అలా.. ఉన్నతోద్యోగులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల తాజా చిరునామాగా మారిపోయింది దుబాయ్‌. మరీ ముఖ్యంగా 2022లో. ఈ మేరకు విలాస నగరంలో

 Dubai : కొనేద్దాం.. ఓ ఇల్లు దుబాయ్‌లో!!

సంపన్న భారతీయుల చూపు ధనిక నగరం వైపు

నిరుడు ఇళ్ల కొనుగోలుకు 35 వేల కోట్ల వ్యయం

మొత్తం కొనుగోలుదారుల్లో 40 శాతం మనవాళ్లే

ఢిల్లీ, గుజరాత్‌, పంజాబీలతో పాటు తెలుగోళ్లూ!

దుబాయ్‌, ఫిబ్రవరి 5: అక్కడా.. ఇక్కడా కాదు భాయ్‌.. కొంటే గింటే బుర్జ్‌ ఖలీఫా దగ్గర దుబాయ్‌లోనే ఇల్లు కొనేద్దాం అంటున్నారు సంపన్న భారతీయులు. ధరకు వెరవకుండా.. ఖరీదైన నగరంలో ఓ ఇల్లు కొనిపడేస్తున్నారు. అలా.. ఉన్నతోద్యోగులు, వ్యాపార, పారిశ్రామికవేత్తల తాజా చిరునామాగా మారిపోయింది దుబాయ్‌. మరీ ముఖ్యంగా 2022లో. ఈ మేరకు విలాస నగరంలో ఇళ్ల కొనుగోలుకు నిరుడు మనోళ్లు ఖర్చు చేసిన మొత్తం.. అక్షరాలా రూ.35,500 కోట్లు (16 బిలియన్‌ దిర్హామ్‌లు). కాగా, 2021 సంవత్సరంలో భారతీయులు దుబాయ్‌లో ఇళ్ల ఖరీదుకు చేసిన వ్యయంకేవలం 9 బిలియన్‌ దిర్హామ్‌లే. అంటే.. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెట్టింపు కావడం విశేషం. మరోవైపు దుబాయ్‌లో ఇళ్లు కొన్న విదేశీయుల్లో భారతీయుల వాటా 40ు. అందులో అత్యధికులు హైదరాబాద్‌, ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్‌ వారు కావడం మరో విశేషం. దుబాయ్‌లో భారతీయులు కొంటున్న ఇళ్ల విలువ రూ.3.60 కోట్ల నుంచి రూ.3.80 కోట్ల వరకు ఉంటోంది. అద్దెకు ఇచ్చినా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వస్తుంది. ముంబైలోలాగే అద్దెల్లో వృద్ధి ఏటా 4-5 శాతం ఉంటుండడం గమనార్హం. ఈ కారణంగానూ వైట్‌ కాలర్‌ ఉద్యోగులు దుబాయ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ‘‘భారతీయులతో మా లావాదేవీలు 2022లో రెండున్నర రెట్లు పెరిగాయి. 2019 మొత్తమ్మీద జరిగిన లావాదేవీలు.. గతేడాది ఒక్క నెలలోనే జరిగాయి. అసలు దుబాయ్‌ రియల్టీ అమ్మకాల్లో 15 నుంచి 20 శాతం వాటా భారత సంతతిదే’’ అని దమాక్‌ ప్రాపర్టీ డైరెక్టర్‌ ఆఫ్‌ స్ట్రాటజీ అష్రత్‌ చౌధురీ పేర్కొనడం విశేషం.

కేవలం 9 బిలియన్‌ దిర్హామ్‌లే. అంటే.. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రెట్టింపు కావడం విశేషం. మరోవైపు దుబాయ్‌లో ఇళ్లు కొన్న విదేశీయుల్లో భారతీయుల వాటా 40%. అందులో అత్యధికులు హైదరాబాద్‌, ఢిల్లీ, గుజరాత్‌, పంజాబ్‌ వారు కావడం మరో విశేషం. దుబాయ్‌లో భారతీయులు కొంటున్న ఇళ్ల విలువ రూ.3.60 కోట్ల నుంచి రూ.3.80 కోట్ల వరకు ఉంటోంది. అద్దెకు ఇచ్చినా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వస్తుంది. ముంబైలోలాగే అద్దెల్లో వృద్ధి ఏటా 4-5 శాతం ఉంటుండడం గమనార్హం. ఈ కారణంగానూ వైట్‌ కాలర్‌ ఉద్యోగులు దుబాయ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ‘‘భారతీయులతో మా లావాదేవీలు 2022లో రెండున్నర రెట్లు పెరిగాయి. 2019 మొత్తమ్మీద జరిగిన లావాదేవీలు.. గతేడాది ఒక్క నెలలోనే జరిగాయి. అసలు దుబాయ్‌ రియల్టీ అమ్మకాల్లో 15 నుంచి 20 శాతం వాటా భారత సంతతిదే’’ అని దమాక్‌ ప్రాపర్టీ డైరెక్టర్‌ ఆఫ్‌ స్ట్రాటజీ అష్రత్‌ చౌధురీ పేర్కొనడం విశేషం.

పడిపోయిన మార్కెట్‌ పైకి లేచింది..

2015-16 మధ్య దుబాయ్‌ రియల్టీ ఉజ్వలంగా వెలిగింది. అయితే, కొవిడ్‌ కాలంలో అక్కడి రెంటల్‌ మార్కెట్‌ 30 శాతం పడిపోయింది. నేడు కోలుకుని ఏడేళ్ల కిందటి స్థాయికి చేరింది. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల రవాణా పరంగా సౌకర్యంగా ఉంటుందని దుబాయ్‌ను ఎంచుకుంటున్నా రు. ‘‘నేను వృత్తి రీత్యా లండన్‌- హైదరాబాద్‌ మధ్య తిరగాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు దుబాయ్‌ నాకు అత్యంత అనువు. నాలాంటి భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్‌ వైపు మొగ్గుచూపేందుకు ఇక్కడి అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ సెంటర్‌ కూడా ఒక ప్రధాన కారణం. ఇక్కడ నివాసం ఉండడం ద్వారా విదేశీ సంస్థలతో సంప్రదింపులు సులువు.’’ అని జేవీ వెంచర్స్‌ సహ వ్యవస్థాపకుడు విశాల్‌ గోయల్‌ తెలిపారు. మరింతమంది పనివారు, వృత్తి నిపుణులు, పరిశోధకులకు అవకాశం కల్పిస్తూ గతేడాది గోల్డెన్‌ వీసా ప్రోగ్రామ్‌ పరిధిని విస్తరించడంతో దుబాయ్‌లో ఇంటిపైన పెట్టుబడి పెట్టొచ్చు అని మనవారికి నమ్మకం కలిగించింది. యూఈలో నివాసం, వృత్తి, చదువు కోసం వచ్చే వారు దీర్ఘకాలం నివసించేందుకు వీలు కల్పించేదే గోల్డెన్‌ వీసా.

విజయవాడ నుంచి వెళ్లిన వ్యక్తి ఏమన్నాడంటే..

‘‘దుబాయ్‌లో భారత విద్యా కరికులంతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమమైన విద్యాసంస్థలున్నాయి. అంతేకాకుండా దుబాయ్‌ అత్యంత సురక్షిత ప్రదేశం. క్యాబ్‌లో లక్షల రూపాయిల డబ్బుతో బ్యాగ్‌ వదిలేసి వెళ్లినా.. డ్రైవర్‌ తిరిగి తెచ్చి ఇస్తాడు’’ అని ఏపీలోని విజయవాడ నుంచి వెళ్లి స్థిరపడిన ఆంత్రప్రెన్యూర్‌ రాహుల్‌ భట్టాడ్‌ పేర్కొనడం విశేషం.

Updated Date - 2023-02-06T03:26:19+05:30 IST