ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ మళ్లీ జరిమానా

ABN , First Publish Date - 2023-01-25T01:01:15+05:30 IST

ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ మరోసారి భారీ జరిమానా విధించింది. విమానంలో ప్రయాణికుల వికృత చేష్టలకు సంబంధించిన వివరాలను సరైన సమయంలో తెలియజేయనందుకు

ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ మళ్లీ జరిమానా

న్యూఢిల్లీ, జనవరి 24: ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ మరోసారి భారీ జరిమానా విధించింది. విమానంలో ప్రయాణికుల వికృత చేష్టలకు సంబంధించిన వివరాలను సరైన సమయంలో తెలియజేయనందుకు రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. పారి్‌స-ఢిల్లీ విమానంలో గత ఏడాది డిసెంబరు ఆరున ఒక ప్రయాణికుడు సిగరెట్‌ తాగుతుండగా పట్టుకున్నారు. అలాగే మరో ప్రయాణికుడు మహిళా ప్రయాణికురాలి దుప్పటిని తీసుకున్నారు. ఈ రెండు ఘటనలపై సరైన సమయంలో వివరాలను తమకు వెల్లడించనందుకు ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దానికి ఎయిర్‌ ఇండియా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన డీజీసీఏ ఆ సంస్థకు జరిమానా విధిస్తూ ఆదేశాలిచ్చింది.

Updated Date - 2023-01-25T01:01:21+05:30 IST