ADGP Arun: ఆ కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే.. రౌడీల వేట కొనసాగిస్తాం..

ABN , First Publish Date - 2023-09-18T10:12:53+05:30 IST

అసాంఘిక కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే రౌడీల వేట కొనసాగిస్తామని ఏడీజీపీ అరుణ్‌(ADGP Arun)

ADGP Arun: ఆ కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే.. రౌడీల వేట కొనసాగిస్తాం..

- ఏడీజీపీ అరుణ్‌ హెచ్చరిక

ప్యారీస్‌(చెన్నై): అసాంఘిక కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే రౌడీల వేట కొనసాగిస్తామని ఏడీజీపీ అరుణ్‌(ADGP Arun) హెచ్చరించారు. తిరువళ్లూర్‌ సమీపంలో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రౌడీల కత్తిపోట్లకు గురై కాంచీపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాసు, రాజేష్‌ అనే పోలీసులను ఏడీజీపీ అరుణ్‌, డీఐజీ పొన్ని తదితరులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఏడీజీపీ అరుణ్‌ విలేకరులతో మాట్లాడుతూ... రౌడీల ఆటకట్టించేందుకు వేట కొనసాగుతుందని, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాల్లో మాజీ రౌడీలు, నేరాలకు పాల్పడుతున్న వారి కదలికలపై నిఘా ముమ్మరం చేశామన్నారు. పోలీసులపై దాడికి పాల్పడిన శ్రీ పెరుంబుదూర్‌ రౌడీ విశ్వనా10:03 18-09-2023థన్‌పై ఎనిమిది హత్యలు, మూడు హత్నాయత్నం, దౌర్జన్యాలకు సంబంధించి మొత్తం 24 కేసులు నమోదయ్యాయని, అతను జైలులో ఉంటూనే తన అనుచరుల ద్వారా హత్యలు చేయిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌ చేస్తారంటూ విశ్వనాథన్‌ గత వారమే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడన్నారు. ఆ వీడియోలో పోలీసు అధికారులను బెదిరిస్తున్నట్లు ఉందని, దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని ఏడీజీపీ తెలిపారు.

Updated Date - 2023-09-18T10:12:53+05:30 IST