Quran: స్టాక్‌హోమ్‌లో ఖురాన్ దహనంపై వెల్లువెత్తిన నిరసనలు

ABN , First Publish Date - 2023-01-25T07:50:17+05:30 IST

స్టాక్‌హోమ్‌లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల డానిష్ తీవ్రవాద నాయకుడు రాస్మస్ ఖురాన్ దహనం చేసిన ఘటనపై నిరసనలు...

Quran: స్టాక్‌హోమ్‌లో ఖురాన్ దహనంపై వెల్లువెత్తిన నిరసనలు
Stockholm sparks protest

స్టాక్‌హోమ్‌: స్టాక్‌హోమ్‌లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల డానిష్ తీవ్రవాద నాయకుడు రాస్మస్ ఖురాన్ దహనం చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి.(Quran) ఖురాన్ దహనం ఘటన ఇస్తాంబుల్‌లో(Istanbul) నిరసనలకు దారితీసింది.ఈ ఘటన స్వీడన్-టర్కీ(Sweden-Turkey) దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది.స్టాక్‌హోమ్‌లో జరిగిన ఈ ఘటన స్వీడన్ నాటో (NATO) సభ్యత్వంపై మాట్లాడటానికి టర్కీని ప్రేరేపించింది.ఇస్తాంబుల్‌లోని స్వీడిష్ కాన్సులేట్ వెలుపల నిరసన సందర్భంగా ఒక మహిళ ఖురాన్ పట్టుకుంది.

‘‘పవిత్రమైన గ్రంథాలను తగలబెట్టడం గౌరవపరిచే చర్య. ఈ రోజు స్టాక్‌హోమ్‌లో జరిగిన ఘటనతో మనస్తాపం చెందిన ముస్లింలందరికీ నేను నా సానుభూతిని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని స్వీడిష్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ట్వీట్ చేశారు.ఈ ఘటన నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్వీడన్‌ను హెచ్చరించారు.సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్ సహా అనేక అరబ్ దేశాలు స్టాక్‌హోమ్‌లో ఖురాన్ దహనం ఘటనను ఖండించాయి.

Updated Date - 2023-01-25T08:00:25+05:30 IST