papaya: బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!
ABN, First Publish Date - 2023-04-19T18:11:48+05:30
బొప్పాయి పండు (పొప్పడి పండు) తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి
బొప్పాయి పండు (పొప్పడి పండు) తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి..
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవి కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.
శరీర బరువు తగ్గాలనుకునేవారికి ఇది దివ్య ఔషధం, పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్ చాలా తక్కువ
బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉండి ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును నిస్సందేహంగా తినవచ్చు. డయాబెటిస్ వచ్చే అవకాశమున్న వారు ఈ పండు తింటే డయాబెటిస్ బారిన పడరు.
ఈ పండులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది. ఆర్థరైటి్‌సతో బాధపడేవారికి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది.
బొప్పాయిలో పఫైన్ అండే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేట్లు చేస్తుంది. ఇందులో ఉన్న పీచు పదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది.
బహిస్టు సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్లు చేస్తుంది.
బొప్పాయిలో విటమిన్ సి, బెటా కెరోటిన్ వంటి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మడతలు పడకుండా, చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు మీలో కనిపించకుండా కాపాడతాయి.
బొప్పాయిలో పైటో న్యూట్రియంట్స్ ప్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని కణాల డీఎన్‌ఎని పరిరక్షిస్తాయి. కేన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.
స్నాక్స్‌లా బొప్పాయి ముక్కలను తింటే పని ఒత్తిడిని సైతం సులభంగా అధిగమించవచ్చు.
Updated Date - 2023-04-19T18:11:48+05:30 IST