papaya: బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!

ABN , First Publish Date - 2023-04-19T18:11:48+05:30 IST

బొప్పాయి పండు (పొప్పడి పండు) తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి

papaya: బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!
papaya

  • బొప్పాయి పండు (పొప్పడి పండు) తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి..

  • బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవి కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.

  • శరీర బరువు తగ్గాలనుకునేవారికి ఇది దివ్య ఔషధం, పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ

  • బొప్పాయిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండి ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

  • మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును నిస్సందేహంగా తినవచ్చు. డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండు తింటే డయాబెటిస్‌ బారిన పడరు.

  • ఈ పండులో విటమిన్‌ ఎ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది. ఆర్థరైటి్‌సతో బాధపడేవారికి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది.

  • బొప్పాయిలో పఫైన్‌ అండే డైజెస్టివ్‌ ఎంజైమ్‌ ఉంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేట్లు చేస్తుంది. ఇందులో ఉన్న పీచు పదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది.

  • బహిస్టు సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్లు చేస్తుంది.

  • బొప్పాయిలో విటమిన్‌ సి, బెటా కెరోటిన్‌ వంటి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మడతలు పడకుండా, చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు మీలో కనిపించకుండా కాపాడతాయి.

  • బొప్పాయిలో పైటో న్యూట్రియంట్స్‌ ప్లవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని కణాల డీఎన్‌ఎని పరిరక్షిస్తాయి. కేన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి.

  • స్నాక్స్‌లా బొప్పాయి ముక్కలను తింటే పని ఒత్తిడిని సైతం సులభంగా అధిగమించవచ్చు.

Updated Date - 2023-04-19T18:11:48+05:30 IST