Healthy Drink: ఈ నీళ్లతో కోటి ఉపయోగాలు
ABN , First Publish Date - 2023-01-04T11:53:57+05:30 IST
వేసవి (summer)లోనే కొబ్బరి నీళ్లు (coconut water) తాగుతూ ఉంటాం. కానీ నిండు ఆరోగ్యం సొంతమవ్వాలంటే కాలంతో పని లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.

వేసవి (summer)లోనే కొబ్బరి నీళ్లు (coconut water) తాగుతూ ఉంటాం. కానీ నిండు ఆరోగ్యం సొంతమవ్వాలంటే కాలంతో పని లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.
బరువు తగ్గిస్తాయి: కొబ్బరి నీళ్లలో కొవ్వు ఉండదు. కాబట్టి తాగగలిగినన్ని కొబ్బరి నీళ్లు వీలైనన్ని ఎక్కువ సార్లు తాగవచ్చు. కొబ్బరి నీళ్లతో ఆకలి తీరుతుంది. ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు.
మధుమేహం దూరం: కొబ్బరి నీళ్లలో చక్కెరలు తక్కువ. మధుమేహం (diabetes) ముప్పు నుంచి కూడా కొబ్బరి నీరు రక్షణ కల్పిస్తుంది.
జీర్ణశక్తి పెంచుతాయి: మంచి నీళ్ల కంటే కొబ్బరి నీళ్లు హైడ్రేటింగ్ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరినీళ్లతో అజీర్తి తొలగి, జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తినే పదార్థాల్లోని పోషకాలను శరీరం మెరుగ్గా శోషించుకోగలుగుతుంది.
వైరస్లతో పోరాడుతుంది: కొబ్బరి నీళ్లు యాంటీ వైరల్ (Anti viral), యాంటీ ఫంగల్ (Antifungal) సుగుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి సంబంధిత రుగ్మతలు దరి చేరకుండా ఉంటాయి.
మెటబాలిజం మెరుగు: కొబ్బరినీళ్లలో సోడియం (Sodium) తక్కువ, పొటాషియం (Potassium) ఎక్కువ. ఇవి శక్తినివ్వడమే కాకుండా మెటబాలిజంను పెంచుతాయి. కాబట్టి ఎనర్జీ డ్రింక్ (Energy drink)లకు బదులుగా కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.
Read more