ఆ కళాశాలకు భారీగా పెరిగిన డిమాండ్‌.. ఇప్పటికే అడ్మిషన్లకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా..

ABN , First Publish Date - 2023-05-27T12:57:03+05:30 IST

నగరంలోని రాజధాని కళాశాల(Rajdhani College)లో చేరేందుకు సుమారు 40 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. చెన్నై(Chennai)లో ఉన్న అన్ని కళాశాలల

ఆ కళాశాలకు భారీగా పెరిగిన డిమాండ్‌.. ఇప్పటికే అడ్మిషన్లకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలోని రాజధాని కళాశాల(Rajdhani College)లో చేరేందుకు సుమారు 40 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. చెన్నై(Chennai)లో ఉన్న అన్ని కళాశాలల కంటే ఈ కళాశాలలోనే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. బీకామ్‌ ఇంగ్లీష్‌ మీడియం మొదటి షిఫ్ట్‌లో ప్రవేశానికి 11,604 మంది, బీఏ తమిళ కోర్సులో చేరేందుకు 9410 మది, బీఎస్సీ కెమిస్ట్రీలో చేరేందుకు 8229 మంది, బీఏ లిటరేచర్‌ (ఆంగ్లం) కోర్సులో చేరేందుకు 6717 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విధంగా రాణిమేరీ కళాశాలలో బీకామ్‌లో చేరేందుకు 7006 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించిన కళాశాలల్లో రాజధాని కళాశాల ప్రథమ స్థానం, కోయంబత్తూరు ప్రభుత్వ కళాశాల (34,743 దరఖాస్తులు) ద్వితీయ స్థానం, వ్యాసార్పాడి అంబేడ్కర్‌ కళాశాల (29,260 మంది) తృతీయ స్థానంలో నిలిచాయి.

Updated Date - 2023-05-27T12:57:03+05:30 IST