JEE Main ఫస్ట్‌ డే సెషన్స్‌పై మిశ్రమ స్పందన

ABN , First Publish Date - 2023-01-25T15:50:21+05:30 IST

మన దేశంలోని అత్యున్నత ఇంజనీరింగ్‌ కళాశాల (Engineering College)ల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ (JEE Main)పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల

JEE Main ఫస్ట్‌ డే సెషన్స్‌పై మిశ్రమ స్పందన
మిశ్రమ స్పందన

  • ఎన్‌‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే ప్రశ్నలన్నీ!

న దేశంలోని అత్యున్నత ఇంజనీరింగ్‌ కళాశాల (Engineering College)ల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ మెయిన్‌ (JEE Main)పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల (NCERT books)ను ఫాలో అయితే మంచిదని అకడమిక్‌ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం నుంచి ఈ ఎగ్జామ్స్‌ (Exams) ఆరంభం కాగా ఉదయం జరిగిన మొదటి సెషన్‌లో మేథ్స్‌లో అడిగిన ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. ఫిజిక్స్‌లో ఎక్కువగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీలో ఫిజికల్‌, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ (Chemistry)కి ప్రాధాన్యం ఇచ్చారు. రెండో సెషన్‌లో మేథ్స్‌ పేపర్‌ మోడరేట్‌గా ఉంది. ఫిజిక్స్‌ (Physics)లో మొత్తం సిలబస్‌ నుంచి ప్రశ్నలు వచ్చాయి. కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీకి ఎక్కువ వెయిటేజ్‌ ఇచ్చారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సులువుగానే ఉన్నాయని చెప్పవచ్చు.

  • దేశంలోని ఎన్‌ఐటీ సహా కేంద్ర ప్రాయోజిత ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో సాధించిన ర్యాంకే ప్రామాణికం. ఈ టెస్ట్‌లో మెరిట్‌లో ఉన్న మొదటి రెండున్నర లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం ఉంటుంది. మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టులో మళ్ళీ రెండు విభాగాలు ఉంటాయి. మొదటి పార్టులో 20 మల్టిపుల్‌ చాయిస్‌ సింగిల్‌ కరెక్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు. మిగిలిన 10 న్యూమరికల్‌ వాల్యూ బేస్డ్‌ ప్రశ్నలు కాగా వాటిలో అయిదింటికి జవాబులు కంప్యూటర్‌పై టైప్‌ చేయాలి. ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున మొత్తం 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. సమాధానం కరెక్ట్‌ అయితే నాలుగు మార్కులు, తప్పుగా గుర్తిస్తే నెగెటివ్‌ అంటే ఒక మార్కు కట్‌ చేస్తారు. 300 మార్కులకు పేపర్‌ ఉంటుంది.

  • ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఫాలో అయితే చాలని, సీబీఎ్‌సఈ 11, 12 తరగతులకు నిర్దేశించిన సిలబస్‌ పరిధిలోనే ప్రశ్నలన్నీ ఉన్నాయని ప్రముఖ కోచింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి. ఉదయం సెషన్‌ విషయానికి వస్తే, చాప్టర్ల కవరేజీలో సమతూకం పాటించారని ప్రముఖ కోచింగ్‌ సంస్థ ‘ఫిట్జీ’ అభిప్రాయపడింది. గత ఏడాదితో పోల్చుకుంటే సులువుగానే ఉందని కూడా తెలిపింది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇచ్చిన ఉదాహరణల సాల్వింగ్‌కు తోడు తగు సంఖ్యలో మాక్‌ టెస్ట్‌లు రాయగలిగితే విజయం సాధ్యమేనని ఆకాష్‌ బైజూస్‌ నేషనల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌(ఇంజనీరింగ్‌) అజయ్‌ శర్మ పేర్కొన్నారు. మేథ్స్‌లో ప్రశ్నల నిడివి ఎక్కువ కావడం, ఫిజిక్స్‌లో ఎక్కువ ఫార్ములా ఆధారితం కావడంతో మొత్తమ్మీద ఒకింత కష్టంగా ఉందని కొందరు విద్యార్థులు చెబుతున్నారని విద్యామందిర్‌ క్లాసె్‌స(వీఎంసీ) చీఫ్‌ అకడమిక్‌ అధికారి సౌరభ్‌ కుమార్‌ వివరించారు.

  • మేథ్స్‌లో అన్ని చాప్టర్లపై సమదృష్టి చూపారు. అయితే ఆల్జీబ్రా, కాలిక్యుల్‌సకు కొద్దిగా ఎక్కువ ప్రాముఖ్యం కల్పించారు. డిటెర్మినెంట్స్‌, 3డీ జామెట్రీ, వెక్టర్స్‌, పర్మిటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌, లిమిట్స్‌ అండ్‌ కంటిన్యూయిటీ, డెఫినెట్‌ ఇంటెగ్రల్స్‌, ఏరియా అండ్‌ కర్వ్స్‌, పారాబోలా, ఎలిప్స్‌ అండ్‌ సర్కిల్‌ తదితరాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో అడిగిన ప్రశ్నల్లో కాన్సెప్ట్‌ - అప్లికేషన్‌ సులువుగానే ఉంది. థెర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్‌, ఆప్టిక్స్‌, మాగ్నటిజమ్‌, మోడ్రన్‌ ఫిజిక్స్‌ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడిగారు. ఫిజికల్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో న్యూమరికల్‌ బేస్డ్‌ ప్రశ్నలు ఇచ్చారు.

j-2.gif

Updated Date - 2023-01-25T15:56:18+05:30 IST