వాననీటిని ఒడిసిపట్టాలి

ABN , First Publish Date - 2023-02-04T22:26:13+05:30 IST

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వాననీటిని ఒడిసి పట్టాలని ఏఈవోలకు వాలంతరీ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ బి.కృష్ణారావు సూచించారు.

వాననీటిని ఒడిసిపట్టాలి
ఏఈవోకు సర్టిఫికెట్‌ అందజేస్తున్న వాలంతరీ డైరెక్టర్‌ కృష్ణారావు, జేడీఏ విజయనిర్మల

వైరా, ఫిబ్రవరి 4: మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వాననీటిని ఒడిసి పట్టాలని ఏఈవోలకు వాలంతరీ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ బి.కృష్ణారావు సూచించారు. జిల్లాలోని ఏఈవోలకు రెండురోజులపాటు వైరాలోని రైతువేదికలో వాననీటిని ఒడిసి పట్టడంలో భాగంగా నీరు, భూమి యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం శిక్షణ ముగింపులో డైరెక్టర్‌ కృష్ణారావు, ఖమ్మంజిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఎం.విజయనిర్మల పాల్గొని ప్రసంగించారు. శిక్షణలో పాల్గొన్న ఏఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు. వానా కాలంలో రెండు నుంచి మూడునెలలు వాననీటిని ఒడిచిపట్టుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఏఈవోలకు శిక్షణనిచ్చారు. ఫారం ఫాండ్స్‌ వంటి నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఎక్కడికక్కడ కురిసిన వానను భూమిలోకి ఇంకేటట్లు చేసుకొని భూగర్భజలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైరా ఏడీఏ వి.బాబూరావు, వాలంతరీ ఏడీఏ సునీత, ఏవో అన్నపూర్ణ, వైరా, కొణిజర్ల ఏవోలు ఎస్‌.పవన్‌కుమార్‌, డి.బాలాజీ, టెక్నీకల్‌ ఏవో వాహిని పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T22:26:15+05:30 IST